ETV Bharat / sitara

సింగర్ దిల్జిత్, నటి కంగన మాటల యుద్ధం! - కరణ్ జోహార్​

రైతుల ఆందోళన విషయంలో వివాదాస్పద కామెంట్ చేసింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. 'ఛలో దిల్లీ' ర్యాలీలో పాల్గొన్న ఓ సిక్కు వృద్ధురాలిని షాహీన్‌ బాగ్‌ బామ్మగా భావించి.. తన గురించి తప్పుడు సమాచారంతో కూడిన ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో పంజాబీ సింగర్ దిల్జిత్.. కంగనపై విమర్శలు గుప్పించాడు.

kangana tweets
సింగర్ దుల్జిత్... నటి కంగన మాటల యుద్ధం!
author img

By

Published : Dec 4, 2020, 10:27 AM IST

Updated : Dec 4, 2020, 11:44 AM IST

సందర్భమేదైనా సరే తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌. ఇటీవల కంగన తప్పుగా చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం ఆమెని మరోసారి వివాదాల్లోకి లాగింది. దిల్లీలో రైతుల ఆందోళనను ఉద్దేశిస్తూ కొన్నిరోజుల క్రితం కంగన ఓ ట్వీట్‌ చేసింది. రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ సిక్కు వృద్ధురాలి(షాహీన్‌ బాగ్‌ బామ్మగా భావించి) గురించి తప్పుడు సమాచారంతో కూడిన ట్వీట్‌ చేసిన కంగన కొద్దిసేపటికే దాన్ని డిలీట్‌ చేసింది. 'షాహీన్‌బాగ్‌ బామ్మ రూ.100 ఇస్తే చాలు ఇలాంటి ఆందోళనలకు వచ్చేస్తారు' అని కంగన పేర్కొనడం వల్ల పలువురు సెలబ్రిటీలు, పంజాబీ సింగర్‌ దిల్జిత్‌.. కంగనపై విమర్శల వర్షం కురిపించారు.

  • This Bill is going to transform farmers lives for better in many ways, I understand the anxiousness and effect of many rumours but I am certain government will address all doubts, please be patient. I am with my farmers and people of Punjab hold special place in my heart (cont)

    — Kangana Ranaut (@KanganaTeam) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పరస్పరం మాటం యుద్ధం..

తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన కంగన.. దిల్జిత్‌ పెట్టిన ట్వీట్‌పై మండిపడింది. 'నువ్వు కరణ్‌జోహార్‌ పెంపుడు జంతువు. పౌరచట్టం కోసం ఆందోళన చేసిన ఆ బామ్మే ఇప్పుడు రైతుల కోసం నిరసనలు చేస్తుందని మాత్రమే ట్వీట్‌ చేశా. ఇప్పుడు ఈ డ్రామా ఏంటి?' అని రిప్లై ఇచ్చింది.

kangana
మాటకు మాట

కంగన ట్వీట్‌ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన దిల్జిత్‌.. 'ఎవరితో అయితే కలిసి పనిచేశావో వాళ్లందరికీ నువ్వు కూడా పెంపుడు జంతువేనా? అలా అయితే ఆ జాబితా చాలా పెద్దగా ఉంటుంది. ఇది బాలీవుడ్‌ కాదు. పంజాబ్‌. మనుషుల భావోద్వేగాలతో ఎలా ఆడుకోవాలో నీకు బాగా తెలుసు' అని ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు.

kangana
కంగన కామెంట్ చేసింది ఈ బామ్మపైనే

'పని కోసం నువ్వు ఎవరి కాళ్లు పట్టుకుంటున్నావో(కరణ్‌జోహార్‌) వాళ్లకి రోజూ నేను కావాల్సినంత జ్ఞానం పెడుతున్నా. నేను నీలాగా అందరి కాళ్లు పట్టుకునే రకాన్ని కాదు. ఎందుకంటే నేను కంగనా రనౌత్‌' అని నటి విమర్శించింది. అలాగే దిల్జిత్‌ని పరోక్షంగా ఉగ్రవాదితో పోలుస్తూ వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి:చరణ్​ సరసన రష్మిక నటించనుందా?

Last Updated : Dec 4, 2020, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.