హీరో నందమూరి కల్యాణ్‌రామ్.. వచ్చే ఏడాది పండక్కి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. తను నటిస్తున్న 'ఎంత మంచివాడవురా'ను సంక్రాంతికి తెస్తున్నట్లు ధ్రువీకరించాడు. సంబంధిత పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో మెహరీన్ హీరోయిన్గా నటిస్తోంది.

'శతమానం భవతి' వంటి సూపర్ హిట్‌ను అందించిన సతీశ్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందీ సినిమా. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. ఉమేశ్ గుప్తా, సుభాశ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: కుమారుడితో ఆ సినిమా రీమేక్ చేస్తున్న బోనీ కపూర్