షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కబీర్ సింగ్'. తెలుగు 'అర్జున్ రెడ్డి' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. విడుదలై ఐదు వారాలు పూర్తయిన తర్వాత ఈ చిత్ర బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు చూద్దాం.
నెట్ కలెక్షన్లు (భారత్) | 274 కోట్లు |
50% ఎగ్జిబిటర్స్ షేర్ | 137 కోట్లు |
50 % ప్రొడ్యూసర్స్ షేర్ | 137 కోట్లు |
బడ్జెట్ (ప్రొడక్షన్, అడ్వర్టైజింగ్తో కలిపి) | 45 కోట్లు |
ప్రొడ్యూసర్లకు లాభం | 137-45 = 92 కోట్లు |
టీ సిరీస్, సినీ వన్ స్టూడియో (ఒక్కోక్కరికి) | 46 కోట్లు |
భారత్‌లో గ్రాస్ కలెక్షన్స్ | 323 కోట్లు* |
ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ | 363 కలెక్షన్లు* |
(*ఓవర్సీస్ కలెక్షన్లు, ఆడియో హక్కులు, శాటిలైట్ రైట్లను మినహాయించి)
జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన' కబీర్ సింగ్' భారత్‌లో 3,123 స్క్రీన్స్‌లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్ కౌంట్ 3,616 గా ఉంది.
విడుదలైన మొదటి రోజునే 20.21 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా షాహిద్ కపూర్ కెరీర్లోనే భారీ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో షాహిద్ రెమ్యునరేషన్ భారీగా పెంచాడని సినిమాకు 40 కోట్లు డిమాండ్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఖండించాడీ యువ హీరో.
గ్రాస్ కలెక్షన్లు, నెట్ కలెక్షన్లకు తేడా
గ్రాస్ కలెక్షన్లు : టికెట్స్ ద్వారా వసూళైన మొత్తం
నెట్ కలెక్షన్లు : గ్రాస్ కలెక్షన్లు-ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్
ఇవీ చూడండి.. 'భావోద్వేగానికి గురై ఏడ్చిన సందర్భాలెన్నో'