ఓటమికి భయపడకుండా ముందుకు సాగడమే తన జీవితంలోని ప్రయోజనకర అంశమన్నాడు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం. దీనితో పాటే తాను ఎదుర్కొన్న జయపజయాలను ఓ చాట్ షోలో వెల్లడించాడు.
"నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినా.. అప్పటి విలువలను బలంగా నమ్ముతాను. నా జీవితంలో ఇప్పటి వరకూ ఎన్నో విజయాలను, అపజయాలను చూశాను. అందుకే ఓటమితో ఎప్పుడూ ప్రభావితం చెందను"
- జాన్ అబ్రహాం, బాలీవుడ్ హీరో
తన జీవితంలో స్నేహితులతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు జాన్ అబ్రహాం.
"నా స్నేహితులలో ఒకరైన సుకు ఆటోరిక్షా డ్రైవర్.. నన్ను రోజూ అఫీస్ నుంచి తీసుకువచ్చేవాడు. ఒకరోజు తనతో కలిసి 'కాకా కాకా' అనే తమిళ సినిమా చూశాను. ఆ చిత్రాన్ని రీమేక్ చేయమని సుకు సలహా ఇచ్చాడు. అప్పుడే 'ఫోర్స్' తీశా"
- జాన్ అబ్రహాం, బాలీవుడ్ నటుడు
హాలీడే ప్లాన్స్ ఏమైనా చేసుకున్నారా.. అని అడిగిన ప్రశ్నకు జాన్ అబ్రహాం.. "నేను పని రాక్షసుడిని. గత 18 ఏళ్లలో కేవలం 5 రోజులే సెలవు తీసుకున్నాను" అని బదులిచ్చాడు.
ఇదీ చదవండి:- 'విజయ్.. నా స్నేహితుడు.. ప్రేమికుడు.. భర్త'