తమిళ నటుడు సూర్య నటించిన 'జై భీమ్' సినిమా చుట్టూ వివాదాలు (jai bhim disputes) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హీరో సూర్యపై (Tamil hero surya) వన్నియార్ సంఘం.. తమిళనాడు చిదంబరంలోని కోర్టులో పరువు నష్టం దావా వేసింది(case on suriya). హీరో సూర్య సహా దర్శకుడు జ్ఞానవేల్, నిర్మాత జ్యోతిక, ఈ సినిమాను ప్రదర్శించిన ఓటీటీ వేదిక అమెజాన్‌పై సెక్షన్ 153, 153(ఏ), 499, 500, 503, 504 ప్రకారం చర్యలు తీసుకోవాలని వన్నియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పు థా అరుల్మోళి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉద్దేశపూర్వకంగా తమ వర్గాన్ని కించపరిచేలా, తమ ప్రతిష్ఠను దిగాజార్చేలా సినిమాలో నిందితులు చూపించారని అరుల్మోళి ఆరోపించారు. ఈ సినిమా ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు ఆజ్యం పోసేలా, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉందన్నారు.
'క్యాలెండర్లో గుర్తు మాదే..'
సినిమాలో బలహీన వర్గానికి చెందిన రాజకన్నును హింసించిన పోలీస్ అధికారి పాత్రను తమ వర్గానికి చెందిన వ్యక్తిగా చూపారని వన్నియార్ సంఘం ఆరోపిస్తోంది. నిజ జీవితంలో జరిగిన ఘటనలో (jai bhim real story) పోలీస్ అధికారి పేరు ఆంథోనిసామి అని, అతను క్రైస్తవుడు చెబుతోంది. జై భీమ్ సినిమాలో మాత్రం సబ్ ఇన్స్పెక్టర్ పాత్రను వన్నియార్ వర్గానికి చెందిన వ్యక్తిగా చూపించారని అరుల్మోళీ చెప్పారు. ఓ సీన్లో క్యాలెండర్లో తమ సంఘం గుర్తయిన (Vanniyar Sangam logo) అగ్ని కుంభాన్ని కూడా ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.5 కోట్ల పరిహారం!
దీనిపై సినిమా నిర్మాణ సంస్థ, నిర్మాత, డైరెక్టర్లకు (jai bhim director) ఇటీవల లీగల్ నోటీసులు పంపించారు అరుల్మోళి. సినిమాను ప్రసారం చేసిన అమెజాన్ సంస్థపైనా సివిల్, క్రిమినల్ కేసులను పెట్టారు. సినిమాలో తమ సామాజిక వర్గానికి సంబంధించిన సీన్లు, అగ్నికుందం చిహ్నాన్ని తొలగించాలని నోటీసులో పేర్కొన్నారు. సామాజిక వర్గానికి జరిగిన నష్టానికి ప్రతిగా.. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా రూ.5 కోట్ల పరిహారం సైతం చెల్లించాలని అన్నారు.
జై భీం సినిమా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు.
ఇవీ చూడండి: