ETV Bharat / sitara

సమంత లాంటి అమ్మాయితో పెళ్లి.. ఓ పాట కోసం 20 రోజులు - 96 తమిళ చిత్రం

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత శర్వానంద్​ల 'జాను'. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు హీరోహీరోయిన్లు. అవేంటి? అందులోని ఆసక్తికర అంశాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

JAAnu-Spl-Chit-Chat-With-Sharwanand_Samantha
'ఇలాంటి క్లాసికల్స్​ టచ్​ చేయకూడదంటూనే నటించా'
author img

By

Published : Feb 3, 2020, 11:58 AM IST

Updated : Feb 28, 2020, 11:54 PM IST

కుర్రకారు హృదయాలను హత్తుకున్న దృశ్యకావ్యం '96'. ఈ సినిమాను 'జాను' పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. సమంత, శర్వానంద్‌ జంటగా నటించారు. ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రవిశేషాలను పంచుకున్నారు హీరోహీరోయిన్లు.

తమిళంలో మంచి విజయం సాధించిన '96' సినిమాను రీమేక్‌ చేస్తున్నారు కదా.. మరి మీకు ఏమైనా భయం వేసిందా?

సమంత: '96' ఓ క్లాసిక్‌. ఆ సినిమా చూశాక.. ఇలాంటి క్లాసిక్స్​ను ఎవరూ టచ్‌ చేయకూడదని నేనే ట్వీట్‌ చేశాను. అలాంటి ఒప్పుకొన్నాక చాలా భయం వేసింది. నిద్రపట్టేది కాదు. ఒక్కోసారి మా మేనేజర్‌కు ఫోన్‌ చేసి 'జాను' చేయనని చెప్పేదాన్ని. నా మాటలు విని మా మేనేజర్‌ భయపడిపోయారు. 'మేడమ్‌.. నాకు హార్ట్‌ ఎటాక్‌ తెప్పిస్తున్నారు' అని అనేవారు.(నవ్వులు)

శర్వానంద్‌: ఇప్పటికీ మా ఇద్దరిలో చాలా భయం ఉంది. టీజర్‌, ట్రైలర్లు వచ్చినప్పుడు మా గురించి ఎలాంటి ట్రోల్స్‌ వస్తాయో అని భయపడ్డాం.

JAAnu-Spl-Chit-Chat-With-Sharwanand_Samantha
జాను చిత్రం విడుదల సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన శర్వానంద్​, సమంత

'96' సినిమాలో త్రిష పేరు 'జాను'. ఆ సినిమాలో ఆ పేరు చాలా చోట్ల వినిపిస్తుంది. అలా మీరు ఈ సినిమాకు ఆ టైటిల్‌ పెట్టారా?

శర్వానంద్‌: త్రిష, విజయ్‌ సేతుపతి చాలా పెద్ద స్టార్స్‌. '96' సినిమాలో వాళ్లిద్దరూ చక్కగా నటించారు. కెరీర్‌ పరంగా చూసుకుంటే వాళ్లు మాకంటే పదేళ్లు ముందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'జాను' సినిమాని చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించాం. ఈ కథ నవతరానికి సంబంధించిన స్టోరీ. మా సినిమాలో స్కూల్‌ రీయూనియన్‌లో కలిసేది 96 బ్యాచ్‌ కాదు. 2004 బ్యాచ్‌. అలా చూసుకున్నా మాది కొంచెం యంగ్‌ జనరేషన్‌గా ఉంటుంది.'జాను' సినిమాలో ప్రధానాంశం లవ్‌. రామ్‌ మిస్‌ అయిన జాను. పదో తరగతిలో ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకునే వాళ్లు వందలో ఐదుశాతం మంది కూడా ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్‌ లవ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే మా సినిమాకి అందరూ కనెక్ట్‌ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను.

మీ జీవితంలో ఏమైనా ప్రేమకథలు ఉన్నాయా?

శర్వానంద్‌: అలాంటి ఏం లేవు.

సమంత: బోరింగ్‌ అనే పదంలో క్యాపిటల్‌ 'బి' అనే లెటర్‌ శర్వాకు కరెక్ట్‌గా సెట్‌ అయ్యింది. ఒక లవ్‌ స్టోరీ లేదు. ఒక లవ్‌ లేదు.

మీరు అన్నీ సినిమాల్లో డైలాగులను చాలా ఫీల్‌ అయ్యి మరి చెబుతారు కదా..! నిజంగానే ప్రేమకథలు లేవా?

సమంత: నాకు అదే అనిపించింది. సినీ పరిశ్రమలో ఉన్న చాలామందికి సంబంధించిన రూమర్స్‌ వస్తుంటాయి కదా అని చెప్పి ఒకరోజు నేను శర్వానంద్‌ గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేశాను. కానీ ఏం రాలేదు.

ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?

శర్వానంద్‌: ఇప్పటివరకూ నాకు ప్రేమకథలు లేవు. కానీ నేను 'మజిలీ' సినిమాలో సమంత లాంటి అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. భర్త ఏం చేసినా తను చాలా సైలెంట్‌గా ఉంటుంది. భర్తను బాగా చూసుకుంటుంది.

ఫస్ట్‌ డే షూటింగ్‌ ఎలా ఉంది?

సమంత: ఫస్ట్‌డే 'జాను' సెట్‌కు వెళ్లగానే కొంచెం భయంగా అనిపించింది. కానీ సెట్‌లో నా ఫస్ట్‌ సీన్‌ వచ్చేసి.. స్కూల్‌ రీయూనియన్‌. ఆ షాట్‌ అవ్వగానే దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. ఇలాంటి మంచి క్లాసిక్‌ సినిమాని నాకు అందించినందుకు.

'96'లో త్రిష నటన మీకు ఏమైనా ఉపయోగపడిందా?

సమంత: త్రిష నటన చాలా అద్భుతంగా ఉంటుంది. 'జాను' సినిమాను ఒప్పుకోక ముందు నేను '96' చిత్రాన్ని ఒక్కసారి చూశాను. ఆ తర్వాత 'జాను' చిత్రానికి సంతకం చేశాక ఆ సినిమాను చూడలేదు. ఎందుకంటే ఎక్కువగా చూస్తే మనకు తెలియకుండానే మనం వాళ్లను ఫాలో అయిపోతుంటాం. అంతేకాకుండా సెట్‌లో ఏవరైనా ఆ సినిమాను చూస్తున్నా సరే అక్కడి నుంచి పారిపోయేదాన్ని.

శర్వానంద్‌ నటన ఎలా ఉంటుంది?

సమంత: శర్వానంద్‌ చాలా గొప్ప నటుడు. అతను నటించిన చాలా సినిమాలు నేను చూశాను. కానీ, ఈ సినిమాలో మాత్రం శర్వా నటన చాలా అద్భుతంగా ఉంటుంది. సీన్‌కు కనెక్ట్‌ అయితే ఆటోమేటిక్‌గా కన్నీళ్లు పెట్టుకుంటాడు. శర్వాలాంటి నటుడ్ని ఇప్పటివరకూ చూడలేదు. టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ ఫైవ్‌ బెస్ట్‌ యాక్టర్స్‌లో శర్వా ఒకరు. శర్వా సపోర్ట్‌ వల్లే నేను బాగా చేయగలిగాను.

షాట్‌ సరిగ్గా రాకపోతే ఏం చేస్తారు?

సమంత: నాకు కనుక షాట్‌ సరిగ్గా రాలేదనిపిస్తే.. డైరెక్ట్‌గా నచ్చలేదని చెప్పేస్తాను.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దిల్‌రాజుతో పనిచేయడం ఎలా ఉంది?

శర్వానంద్‌: రాజు అన్న నా కుటుంబంలో ఒక వ్యక్తిలాంటివారు. నన్ను ఆయన కలిసి ఈ సినిమా గురించి చెప్పగానే.. క్లాసిక్‌ మూవీ చేయాలా? వద్దా? అని బాగా ఆలోచించాను. ఆయన వెంటనే చేయమని చెప్పారు. ఆయన కోసమే 'జాను' చేశాను. ఆయన జడ్జిమెంట్‌ మీద నాకు అంత నమ్మకం ఉంది.

సమంత: రాజు గారు '96' రీమేక్‌ గురించి మా మేనేజర్‌కు ఫోన్‌ చేశారు. నాకు చాలా భయం వేసి చాలా రోజులు ఆయనకు మా మేనేజర్‌తో అబద్దాలు చెప్పించాను. ఊర్లో లేరు, ఆరోగ్యం బాలేదు.. ఇలా చెప్పించేదాన్ని. అలా చాలా రోజుల తర్వాత ఓ రోజు కలిశాను. చేస్తాను అని చెప్పాను. ఆయన అడిగితే తప్పకుండా ఒప్పుకుంటాను.

మాతృకను డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌కుమార్‌ 'జాను' సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్షన్‌ ఎలా అనిపించింది?

శర్వానంద్‌: ఆయన చాలా మంచి డైరెక్టర్‌. 'జాను' సినిమాకు ఆయనను తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ను 20 డేస్‌ షూట్‌ చేశాం.

ఇదీ చూడండి...ఫైటర్​ పైలట్​గా ముద్దుగుమ్మ పాయల్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 28, 2020, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.