ETV Bharat / sitara

మాటల మాంత్రికుడి​ దర్శకత్వంలో వెంకటేశ్​! - త్రివిక్రమ్​ -వెంకటేశ్​ కాంబో మూవీ

ఇప్పటివరకు వెంకటేశ్​ సినిమాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్.. తొలిసారి అతడి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడనే ప్రచారం సాగుతోంది. పూర్తిస్థాయి హాస్యభరిత కథతో దీనిని తెరకెక్కించనున్నారట.

Is Trivikram going to direct Venkatesh?
త్వరలో త్రివిక్రమ్​ దర్శకత్వంలో వెంకటేశ్​!
author img

By

Published : May 6, 2020, 5:36 AM IST

Updated : May 6, 2020, 6:49 AM IST

టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేశ్‌ నటించిన 'వాసు', 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్‌' చిత్రాల వెనకుండి, తన మాటలతో అదరగొట్టారు త్రివిక్రమ్‌. వెంకీ మేనరిజానికి‌ ఇతడి డైలాగులు తోడైతే ఆ మజానే వేరు. మాటల రచయిత నుంచి దర్శకుడిగా మారిన త్రివిక్రమ్..‌. రైటర్​గా ఎంత క్రేజ్‌ సంపాదించాడో దర్శకుడిగా అంతకు మించి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా ఎప్పుడు వస్తుందా? అని కొన్నేళ్ల నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఆ కల నెరవేరే అవకాశముందని సమాచారం.

'అల వైకుంఠపురములో' తర్వాత ఎన్టీఆర్​తో ఓ చిత్రం ప్రకటించారు త్రివిక్రమ్‌. 2021 వేసవిలో విడుదల చేయాలని భావించారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్ పూర్తయిన తర్వాత తారక్‌తో చిత్రీకరణ మొదలుపెట్టాలకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల 'ఆర్ఆర్‌ఆర్‌' ఆగిపోయింది. అది ముగిసిన తర్వాత తారక్​‌తో అంటే అధిక సమయం పడుతుంది. ఈ లోపు మరో ఎంటర్‌టైనింగ్‌ కథతో, వెంకీ హీరోగా ఓ చిత్రం చేయాలనుకుంటున్నారు త్రివిక్రమ్. కామెడీ నేపథ్య కథతో దీనిని తీసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' పూర్తి కావొచ్చు.

Last Updated : May 6, 2020, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.