డార్లింగ్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' రానుందని ప్రకటించగానే డార్లింగ్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. అయితే ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాన్ని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు రవి బస్రూర్ చెప్పారు.
'సలార్', 'ఉగ్రమ్' చిత్రానికి రీమేక్ అంటున్నారు నిజమేనా అని రవిని ప్రశ్నించగా.. 'అది అందరికీ తెలిసిన విషయమే. రీమేక్ అయినా సరే ప్రశాంత్ నీల్ దానిని ఎలా తీస్తాడో మీ అందరికీ తెలుసు' అని అతడు బదులిచ్చారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మ్యూజిక్ 'కేజీఎఫ్'కు ఇచ్చినట్లు 'సలార్'కు కూడా ఇస్తారు కదా? అని ప్రభాస్ తనను అడిగారని, ఇస్తాను అని తాను చెప్పినట్లు రవి బస్రూర్ ఇదే ఇంటర్వ్యూలో వెల్లడించారు.
గోదావరి ఖనిలో 'సలార్' తొలి షెడ్యూల్ను ఇటీవల పూర్తి చేశారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.
ఇది చదవండి: 'సలార్' విలన్ ఫిక్స్.. సోషల్మీడియాలో పోస్టు!