పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'(bheemla nayak release date) చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజైన టైటిల్సాంగ్ రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అయితే.. ఈ సినిమా సంక్రాంతి బరినుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24, లేదా 25న ఈ చిత్రం '(bheemla nayak release date) థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది.
మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం సంక్రాంతి రేసులో 'ఆర్ఆర్ఆర్'(జనవరి 7), 'రాధేశ్యామ్'( జనవరి 14) ఉన్నాయి. 'బంగార్రాజు' (జనవరి 15-ఖరారు కాలేదు) ఉన్నాయి. మహేశ్ 'సర్కారు వారిపాట' చిత్రాన్ని కూడా మొదట జనవరి 13న విడుదల చేయాలని భావించింది చిత్రబృందం. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్1న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: పవన్ కొత్త సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకోనుందా?