ఈ రోజుల్లో క్యాన్సర్ భయంకరమైన వ్యాధిగా తయారవుతోంది. అలాంటి వ్యాధి నుంచి సాధారణ స్థితికి రావాలంటే చికిత్సతో పాటు మానసిక స్థైర్యం చాలా అవసరం. అలాంటి పరిస్థితి నుంచి బయటపడి, ఆరోగ్యంగా దర్శనమిచ్చాడు పీకూ నటుడు ఇర్ఫాన్ ఖాన్.
న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్‌కు లండన్‌లో చికిత్స తీసుకున్న ఆయన తొలిసారి స్వదేశానికి వచ్చాడు. ముంబయి విమానాశ్రయంలో ముఖానికి మాస్కు వేసుకుని వెళ్తూ కనిపించాడు.
'బాగా ఉన్నప్పుడు ప్రేమ విలువ తెలియదు. కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ప్రేమను కచ్చితంగా గుర్తిస్తాం. నా జీవితంలో మీరు చూపిన ప్రేమభిమానం, మద్దతు నన్ను పూర్వస్థితికి తీసుకొచ్చాయి. నేను మళ్లీ మీ ముందుకు వస్తున్నాను'.
--ఇర్ఫాన్‌ఖాన్, బాలీవుడ్ నటుడు