సృజనాత్మకతకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్ కేవలం వెండితెర మాత్రమే. డిజిటల్ విప్లవం తర్వాత ట్రెండ్ మారింది. ప్రేక్షకుడి అభిరుచిలోనూ మార్పు వచ్చింది. అందుకే ఆలోచన, అందంగా ప్రదర్శించగలిగే నైపుణ్యం ఉన్నవాళ్లకు ఆసరాగా నిలిచాయి వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు. వాటిని ప్రదర్శించేందుకు యూట్యూబ్, ఓటీటీలు వేదికలయ్యాయి. అయితే కార్పోరేట్ సంస్థల చేతుల్లో ఉన్న ఓటీటీలపై కన్నేసిన సినీలోకం... వారూ అదే మార్గంలోకి వచ్చి వాటి డిమాండ్‌ను మరింత పెంచేశారు. ఫలితంగా ఆయా కంపెనీలు 24 విభాగాల ఔట్‌పుట్‌ను కొంతకు కొనేసి.. వారి యాప్‌ల్లో పెట్టేసుకుంటున్నాయి.
ఇది ఆరంభంలో బాగానే ఉన్నా వాటికీ కొంత రుసుము పెట్టడమే వినియోగదారుడికి భారంగా మారింది. అయితే కొందరు మాత్రం వారు తీసిన కళాప్రదర్శనలను ఉచితంగానే అందిస్తామని యూట్యూబ్ వేదికను ఎంచుకున్నారు. అందుకే వెబ్ సిరీస్‌లను కూడా రూపాయి తీసుకోకుండా యూజర్లకు చూపించేస్తున్నారు. ఓసారి అలాంటి వాటిపై లుక్కేద్దాం...
కోటా ఫ్యాక్టరీ
టీవీఎఫ్ అనే సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకు ఐదు ఎపిసోడ్లు మాత్రమే విడుదలయ్యాయి. 16 ఏళ్ల అబ్బాయి ఐఐటీ పరీక్షల కోసం కోటా అనే పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఆ కుర్రాడు ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది చిత్రబృందం. ఇందులో నటీనటులు చేసిన యాక్టింగ్‌కు వీక్షకులు ఫిదా అయిపోయారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్టార్ బాయ్స్
ఇద్దరు దక్షిణాది కుర్రాళ్లే ప్రధానంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆరు ఎపిసోడ్లు విడుదలయ్యాయి. నవీన్ రిచర్డ్స్, కెన్నీ సెబాస్టియన్ అనే కుర్రాళ్లు ఇందులో నటిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తోనే రూపొందిన ఈ సిరీస్‌ను కామెడీ జోనర్లో రూపొందించారు. అందుకే ఈ సిరీస్ చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారని నెటిజన్లు చెప్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మామ్ అండ్ కో
తల్లీకొడుకుల మధ్య ఆప్యాయత, అనుబంధాన్ని ఇందులో చూపించారు. పలు కారణాల వద్ద దూరమైన తన కొడుకును ఆ తల్లి ఎలా కలుసుకుంది అనేది కథాంశం. ఆ సమయంలో వారి ప్రేమానురాగాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. ఈ సిరీస్‌ను మీ అమ్మతో చూస్తే.. ఆ ఎమోషన్ భలే ఉంటుందని అంటోంది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అడల్టింగ్
ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌లో ఇద్దరు అమ్మాయిలు కీలకపాత్రల్లో నటించారు. రూమ్మేట్స్గా ఏర్పడిన వారి పరిచయం ఎక్కడకు దారి తీసింది అనేది ఆసక్తిగా చిత్రీకరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హ్యాపీ ఎవర్ ఆఫ్టర్..
పర్ఫెక్ట్ వెడ్డింగ్, పర్ఫెక్ట్ కపుల్ అంటే ఎవరు? అనే సందేహం మీకుందా. అయితే ఈ సిరీస్ కచ్చితంగా చూడాల్సిందే. భార్యాభర్తల మధ్య చిన్నపాటి అలకలు, కోపతాపాలు ఉన్నా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇందులో చూపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లిటిల్ థింగ్స్
ఈ వెబ్‌సిరీస్‌ను తొలుత యూట్యూబ్‌లోనే విడుదల చేసినా... యూత్‌లో ఈ సిరీస్ ఆదరణ చూసి నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ యాప్‌లోనూ అప్లోడ్ చేసింది. ధ్రువ్, కావ్య అనే ఇద్దరి మధ్య ఉండే రొమాంటిక్ రిలేషన్ షిప్, కపుల్ గోల్స్‌ను ఇందులో చాలా చక్కగా చూపించారు. అయితే ఒక్క సీజన్ మాత్రమే ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆపరేషన్ ఎంబీబీఎస్
ఓ మెడికల్ కళాశాల నేపథ్యంలో ఇద్దరు యువతులు, ఒక యువకుడి ప్రయాణాన్ని ఇందులో తెరకెక్కించారు. ఎంబీబీఎస్ తొలి ఏడాదిలో వారు ఎలా అల్లరి చేశారో చూడాల్సిందే. వారి మధ్య స్నేహం యువతను హత్తుకుంటుంది. కచ్చితంగా మెడికల్ స్టూడెంట్లకు బాగా కనెక్ట్ అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వాట్ ద ఫోక్స్
ఇంట్లో కట్టుదిట్టమైన నిబంధనలు ఉంటే ఎలా ఉంటుంది.? పెళ్లైన వాళ్లు కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఎదుర్కొనే పలు ఇబ్బందులను, సంఘటనలను జోడించి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దీన్ని రూపొందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్లీజ్ ఫైండ్ ఎటాచ్డ్
ఇద్దరు సహోద్యోగుల మధ్య అనుకోని ఓ ప్రయాణం ఎక్కడకు దారి తీసింది అనేది కథాంశం. ప్రతి రోజు ఎదుర్కొనే సమస్యలనే ఇందులో ప్రస్తావిస్తూ.. బాగా ప్రెజెంట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బ్యాచిలర్స్
టీవీఎఫ్ నిర్మించిన ఈ సిరీస్ బాగా పాపులర్ అయింది. రెండు సీజన్లు, ఒక్కోదానిలో 9 ఎపిసోడ్లు ఉంటాయి. ఉద్యోగాల వేట నుంచి ప్రతిరోజు యువకులు ఎదుర్కొనే సమస్యలను ఇందులో చూపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఓటీటీల్లో రాజ్యమేలుతున్న అలాంటి వెబ్‌సిరీస్‌లు