ETV Bharat / sitara

'నేను స్టార్ కిడ్​ని కాదు.. స్నేహితుల వల్లే ఇక్కడున్నా'

సినీ వారసత్వం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విద్యుత్ జమ్వాల్. తాజాగా బంధుప్రీతి గురించి మాట్లాడిన విద్యుత్ తానూ ఆ సమస్యను ఎదుర్కొన్నానని తెలిపాడు.

'ఇండస్ట్రీలో ఉన్నానంటే దానికి కారణం స్నేహితులే'

author img

By

Published : Jul 24, 2020, 3:52 PM IST

సినీ నేపథ్యం లేకుండా చిత్రరంగంలో అడుగుపెట్టి విలన్‌గా.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విద్యుత్‌ జమ్వాల్‌. కెరీర్‌లో మొదట్లో విలన్‌గా నటించినా.. 'కమాండో' సిరీస్‌తో హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో జరుగుతున్న బంధుప్రీతి చర్చలపై విద్యుత్‌ తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బంధుప్రీతి, అవకాశాలు ఏమో గానీ.. చేసిన పనికి కనీసం ప్రశంస కూడా ఉండదని వ్యాఖ్యానించాడు. ఇలాంటి వాటికి తాను ముందే సిద్ధమయ్యానని చెప్పుకొచ్చాడు.

"‘సినీ పరిశ్రమలో నువ్వు బయటి వ్యక్తివి అని తెలియజేసే సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ వ్యవస్థ అలా ఉంది. దీన్ని ఎవరూ ఖండించలేరు. కానీ ఏం చేస్తాం? నేను మార్చాలనుకుంటుంది ఒక్కటే ఎవరూ ఏ మనిషిని పట్టించుకోకుండా ఉండకూడదు. వారు చూసిన ప్రతి దానిని అభినందించాలి. దీనికి బంధుప్రీతికి సంబంధం లేదు. కేవలం మంచి మనిషిగా ఉండాలి. ఎవరైనా ఏదైనా చేస్తే వారికి గుర్తింపు ఇవ్వాలి."

-విద్యుత్‌ జమ్వాల్, నటుడు

"సినీ ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో చాలా మంది ఇక్కడ స్నేహితులు దొరకడం కష్టమని అన్నారు. కానీ అది తప్పు. నాకు ఇండస్ట్రీలో మంచి స్నేహితులు ఉన్నారు. కొందరు 'నీ మీద మాకు నమ్మకముంది.. కానీ మా దగ్గర డబ్బులు లేవు అనేవారు'. వారు నాతో ఎలా ఉన్నారో.. నేను అలాగే వారికి అండగా ఉంటా. నేను స్టార్​ కిడ్​ని కాదు. కానీ ఇంకా ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే దానికి కారణం స్నేహితులే" అంటూ చెప్పుకొచ్చాడు విద్యుత్.

విద్యుత్‌ నటించిన 'యారా'.. 'ఖుదా హఫీజ్‌' చిత్రాలు ఓటీటీ వేదికగా త్వరలోనే విడుదలవనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.