ETV Bharat / sitara

పిల్లాడికి.. డైపర్​ తొడగలేకపోయిన కరీన! - నేను పరిపూర్ణ తల్లిని కాదు కరీనా కపూర్

బాలీవుడ్ నటి కరీనా కపూర్(kareena kapoor) తన మాతృత్వ అనుభవాలను పంచుకుంటూ ఓ పుస్తకాన్ని రాసింది. 'ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బుక్​లో తను మొదటిసారిగా తల్లయిన సందర్భంలో చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించింది. ఆ సమయంలో తైమూర్​కు డైపర్​ తొడగడం కూడా కష్టంగా ఉండేదని పేర్కొంది.

Kareena Kapoor
కరీనా కపూర్
author img

By

Published : Jul 17, 2021, 5:30 AM IST

బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ ఖాన్(kareena kapoor).. సైఫ్ అలీ ఖాన్​(saif ali khan)ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవలే మాతృత్వం గురించి తన అనుభవాలను పంచుకుంటూ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. 'ప్రెగ్నెన్సీ బైబిల్'​(pregnancy bible) అనే టైటిల్​తో రిలీజ్ అయిన ఈ బుక్​లో ఇద్దరు పిల్లలకు తల్లి కావడం గురించి, తాను ఎదుర్కొన్న కష్టాలను గురించి వివరించింది. ఈ నేపథ్యంలో తైమూర్ జన్మించిన సమయంలో తాను పరిపూర్ణ తల్లిగా లేనని వెల్లడించింది.

Kareena Kapoor
కరీనా, తైమూర్, జై

"మొదటి సంతానం సమయంలో నేను పరిపూర్ణ తల్లినని భావించలేదు. ప్రారంభంలో తైమూర్​కు డైపర్ తొడగడం కూడా సరిగా రాలేదు. కొన్నిసార్లు దాని ద్వారా మలం లీక్ అయ్యేది. ఆ సమయంలో అతడు 'తన తల్లికి డైపర్ కూడా సరిగా తొడగటం రాదు' అనుకుని ఉంటాడు! ఓ తల్లిగా మిగతా తల్లులకు ఇచ్చే సలహా ఒక్కటే. ఇది మీ సౌలభ్యం, పని తీరు గురించి. మీకైదేతే సరిగా అనిపిస్తుందో అదే చేయండి. మీరెంత గొప్పగా పని చేస్తే మీ తనయుడు అంత సౌకర్యంగా ఉంటాడు. అందుకే ఈ విషయాన్ని చాలా త్వరగా నేర్చుకున్నా."

-కరీనా కపూర్, బాలీవుడ్ నటి

ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన కరీనా.. అతడికి 'జే' అనే పేరు పెట్టినట్లు ఈ మధ్య వెల్లడించింది. తనకు రెండుసార్లు ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురైన మానసిక, శారీరకంగా ఎదురైన సమస్యలను 'ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకంగా రాసింది. దానిని జులై 9న విడుదల చేసింది. ఇది తనకు మూడో బిడ్డలాంటిదని కరీనా చెప్పుకొచ్చింది.

అయితే 'బైబిల్​' అనే పేరు తమ మనోభావాల్ని దెబ్బితీస్తోందని ఆల్ఫా ఒమెగా క్రిస్టియన్ మహాసంఘ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే.. కరీనాపై శివాజీ నగర్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసినప్పటికీ, ఎలాంటి ఎఫ్​ఐఆర్ నమోదు కాలేదని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.

Kareena Kapoor
పుస్తకంతో కరీనా కపూర్

ఇవీ చూడండి: సైఫ్​-కరీనా కుమారుడి​ ఆయాకు అంత జీతమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.