ETV Bharat / sitara

హృతిక్​, దీపిక సినిమా.. క్రేజీ టైటిల్ - ఫైటర్​ హృతిక్​ దీపికా

హృతిక్, దీపిక నటించబోయే సినిమాపై క్లారిటీ వచ్చేసింది. త్వరలో షూటింగ్​ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు ఆదివారం వెల్లడించారు.

hrithik
హృతిక్​
author img

By

Published : Jan 10, 2021, 6:28 PM IST

బాలీవుడ్​లో మరో క్రేజీ కాంబినేషన్​ ఖరారైంది. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె కలిసి నటించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం పుట్టినరోజు చేసుకున్న హృతిక్ వెల్లడించారు. దేశభక్తి, యాక్షన్​ నేపథ్య కథతో ఈ చిత్రం తీయనున్నట్లు తెలిపారు. సిద్ధార్థ్​ ఆనంద్​ దర్శకుడు. ఈ సినిమాకు 'ఫైటర్'​ టైటిల్​ ఖరారు చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 30న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

సిద్ధార్థ్​-హృతిక్​ కాంబోలో ఇప్పటికే వచ్చిన 'బ్యాంగ్​ బ్యాంగ్'​(2014), 'వార్'​(2019) సినిమాలు ఘనవిజయం సాధించాయి.

దీపిక నటించిన '83' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పఠాన్'​ సినిమాలో షారుక్​తో, ప్రభాస్-నాగ్ అశ్విన్​ సినిమాలోనూ హీరోయిన్​గా కనిపించనుందీ భామ.

ఇదీ చూడండి : బాలీవుడ్ అందగాడు.. అమ్మాయిలకు గ్రీకువీరుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.