సాధారణంగా పిల్లల ముందు తల్లిదండ్రులు.. లైంగిక విషయాలు గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకం. తన కూతురు పోర్న్ ఇండస్ట్రీలోకి వెళతానంటే సరేనన్నాడు. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
జాస్, ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్, షిండ్లర్స్ లిస్ట్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు స్పీల్బర్గ్. మికాయిలా స్పీల్బర్గ్.. ఈ దర్శకుడికి ఏడో సంతానం. ఈమె వయసు ప్రస్తుతం 23 ఏళ్లు. ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తను సొంతంగా అడల్ట్ వీడియోలు నిర్మించనున్నట్లు చెప్పింది. ఈ నిర్ణయానికి తన తండ్రి అడ్డుచెప్పలేదంది. ఈ పోర్న్ ఫిల్మ్స్ తనకు మానసిక ప్రశాంతతను ఇస్తాయని వెల్లడించింది.
ఈ విషయంపై ట్వీట్ చేసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. స్టీవెన్ స్పీల్బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్ప విషయమని అన్నాడు. ప్రపంచం నిజంగా అభివృద్ధి చెందుతోందని రాసుకొచ్చాడు.