ETV Bharat / sitara

రెండు తరాల హీరోలతో నటన.. ఈ హీరోయిన్ల ఘనత - tamanna with chiru family

ఒకే కుటుంబంలోని రెండు తరాల హీరోలకు జోడీగా నటించాలంటే హీరోయిన్లకు సవాలే! దానికి వయసు, గ్లామర్​ లాంటి అంశాలు అడ్డొస్తాయి. కానీ, కొందరు భామలు వాటిని అధిగమించి తండ్రీ కొడుకుల సినిమాల్లో నటించారు. అభిమానులను అలరించారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే?

heroines who acted with two generations in tollywood
రెండు తరాలతో మెప్పించిన నాయికలు వీరే!
author img

By

Published : Nov 14, 2020, 9:30 AM IST

ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా గట్టిగా పదేళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది ప్రస్తుతం దశాబ్దాలకు పైగా సినీపరిశ్రమల్లో పాతుకుపోతున్నారు కొందరు కథానాయికలు. అలానే వయసుతో సంబంధం లేకుండా అటు తండ్రి, ఇటు కొడుకు సరసన నటించేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకుల సినిమాల్లో హీరోయిన్​గా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయాన్ని సాధ్యం చేసి చూపించారు కొందరు ముద్దుగుమ్మలు. వారి గురించే ఈ కథనం.

మెగా హీరోలతో..

లక్ష్మీ కల్యాణం చిత్రంతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన కాజల్​ అగర్వాల్​.. రామ్​ చరణ్​ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో'మగధీర'లో నటించి స్టార్​ హోదా తెచ్చుకుంది. ఆ తర్వాత చరణ్​తో 'నాయక్'​, 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాల్లోనూ ఆడిపాడింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెం.150'లో హీరోయిన్​గా చేసి అలరించింది. దీంతో తండ్రీకొడుకులైన చిరు, చరణ్​ల సినిమాల్లో కథానాయికగా చేసిన ఘనతను కాజల్​ సొంతం చేసుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తన విభిన్న నటనతో పాన్​-ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది తమన్నా. 2005లో వచ్చిన 'శ్రీ' చిత్రంతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. రామ్​ చరణ్ సరసన 'రచ్చ'లో నటించి, ఆ తర్వాత చిరు 'సైరా'లోనూ కీలక పాత్ర పోషించింది. కాజల్​​ తర్వాత చిరు, చెర్రీలతో కలిసి నటించిన ఘనత తమన్నాదే.

అక్కినేని వారసులతో..

రకుల్​ ప్రీత్​ సింగ్​ బాలీవుడ్​లో తొలి సినిమా చేసినప్పటికీ.. తెలుగు, తమిళ భాషల్లోనే ఎక్కువగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్య 'రారండోయ్​ వేడుక చూద్దాం'లో నటించి హిట్​ అందుకున్న ఈమె.. ఆ తర్వాత నాగార్జున 'మన్మథుడు 2'లోనూ హీరోయిన్​గా చేసి ఆకట్టుకుంది. దీంతో అక్కినేని కుటుంబంలో రెండు తరాలతో నటించిన ఘనతను రకుల్​ దక్కించుకుంది.

'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. తన​ నటనతో విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. 'భలే భలే మగాడివోయ్​', 'సోగ్గాడే చిన్ని నాయనా' లాంటి చిత్రాలతో సూపర్​హిట్లను సొంతం చేసుకుంది. నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా'తో పాటు ఆయన కుమారుడు నాగచైతన్య 'యుద్ధం శరణం' సినిమాలోనూ నటించి, రెండు తరాల హీరోలతో చేసిన భామగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇదీ చదవండి:ఆ హీరోయిన్ల జోరు.. పెళ్లి అయితే మాకేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.