టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ పోలీస్ దుస్తులు ధరించడం కొత్తేమీ కాదు. చివరిసారిగా ‘బాబు బంగారం’లో అదే గెటప్‌లో సందడి చేశాడు. అయితే త్వరలో మళ్లీ పోలీస్ అవతారంలో ఈ కథానాయకుడు కనిపించనున్నాడని సమాచారం. ఈ సారి వెంకీతో యూనిఫాం వేయించబోతున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఇప్పటికే ‘సినిమా చూపిస్త మామ’, ‘నేను లోకల్’ చిత్రాలతో ఆకట్టుకున్నాడీ డైరెక్టర్.
ప్రస్తుతం... మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు వెంకటేశ్. అయితే.. పోలీస్ గెటప్‌లో కనిపించనున్న కొత్త సినిమా షూటింగ్ నవంబర్ తొలి వారం నుంచి ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ బాబు నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇది చదవండి: 'సాహో' వసూళ్ల సునామీ.. తొలిరోజే సెంచరీకి మించి