బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి దగ్గర పడింది. తన స్నేహితురాలితో ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ నటుడు వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. నటాషా దలాల్తో దాంపత్యం జీవితంలో అడుగుపెట్టనున్నాడు. ఈ ఏడాది నవంబరులోనే వీరి పెళ్లికి ముహుర్తం ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై అధికార ప్రకటన ఏదీ రానప్పటికీ, కొత్త ప్రాజెక్టుల విషయంలో వరుణ్ విరామం ప్రకటించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.
![VARUN DHAWAN WITH NATAHA DHALAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4023675_varun.jpg)
తన వ్యక్తిగత పనుల కోసం నవంబరు మొత్తం సినిమాలకు సంబంధించిన ఎలాంటి పనులు పెట్టుకోవడం లేదన్నాడు వరుణ్. ఈ విషయాన్ని ఇప్పటికే అందరికీ తెలిచెప్పేశాడట. విరామం తీసుకోవడానికి కారణం వరుణ్ పెళ్లే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది అన్నది తెలియాలంటే వరుణ్ పెదవి విప్పాల్సిందే.
ఇది చదవండి: బాలీవుడ్ సినిమాలో ప్రముఖ విదేశీ డ్యాన్సర్లు