ప్రయోగాలు చేసేందుకు విభిన్న పాత్రలతో మెప్పించేందుకు నేనెప్పుడూ సిద్ధమే అంటున్నారు యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. ఆయన నుంచి వచ్చిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'. విజయ్ కుమార్ కొండా దర్శకుడు. మాళవిక, హెబ్బా పటేల్ కథానాయికలు. ఈ చిత్రం గురువారం సాయంత్రం ఆహా ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ సందర్భంగా ఆన్లైన్ మీడియాతో ముచ్చటించారు.
వెండితెర లక్ష్యంగా తెరకెక్కిన చిత్రమిదీ. ఓటీటీ ద్వారా ప్రేక్షకులు ముందుకొచ్చినందుకు ఎలా ఉంది?
కరోనా పరిస్థితులు వల్ల సినిమా విడుదల వాయిదా పడినందుకు కాస్త బాధగానే అనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఓటీటీనే చక్కటి వేదిక. ప్రేక్షకులు బాగా నవ్వుకోవాలి అనే ఉద్దేశంతో చేశాం. అది ఇలా నెరవేరుతున్నందుకు బృందమంతా సంతోషంగా ఉంది.
ఒరేయ్ బుజ్జిగాతో మీ ప్రయాణం ఎలా మొదలైంది?
దర్శకుడు విజయ్‌తో నాకు ముందు నుంచి మంచి స్నేహ బంధముంది. తను కథ చెప్తున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నా. అందుకే ఈ వినోదాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తే బాగుంటుంది అనిపించి చేశా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్ర కథేంటి? మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
కన్ఫ్యూజన్ కామెడీ కథాంశంతో రూపొందించిన చిత్రమిది. నేనిందులో బుజ్జి అనే పాత్రలో కనిపిస్తా. దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంటుంది.
భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
నటుడిగా వైవిధ్యభరిత ప్రయాణాన్ని ఇష్టపడతా. ముఖ్యంగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలు పోషించడమంటే చాలా ఇష్టం. వాలిలో అజిత్ ప్రేమ చదరంగంలో భరత్ లాంటి ప్రతినాయక పాత్రలు చేయాలనుంది. ఎప్పటికైనా ఆ ప్రయత్నం కచ్చితంగా చేస్తా.
మాళవిక, హెబ్బాల పాత్రలు ఎలా ఉంటాయి?
ఈ చిత్రంలో మాళవిక అందరినీ ఆక్టటుకుంటుంది. సెకండాఫ్‌లో తన తండ్రిని మందు అడిగే సీన్ ఒకటుంటుంది. దాని తర్వాత వచ్చే పదమూడు నిమిషాల ఎపిసోడ్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నివ్విస్తుంది. హెబ్బా పటేల్ పాత్ర చిన్నదే అయినా కథకు చాలా కీలకం.
కొత్త ప్రాజెక్టుల కబుర్లేంటి?
ప్రస్తుతం విజయ్ కుమార్‌తోనే మరో చిత్రం, శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, సంతోష్ అనే నూతన దర్శకుడితో మరో చిత్రం చేయాల్సి ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్‌లో డ్రీమ్‌గర్ల్ రీమేక్ చేయాలి. కథ నచ్చితే వెబ్‌సిరీస్‌లకూ సిద్ధమే. భవిష్యత్తులో కచ్చితంగా దర్శకత్వం చేస్తా.