"సముద్రం అంత ప్రేమను చూడాలంటే జీవితం చివరంచుల్లోనే చూడగలం.. అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి".. అంటూ 'ఆరెంజ్'లో లవర్ బాయ్‌గా కనిపించినా.. "ఒక్కొక్కణ్ని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకేసారి రమ్మను" అంటూ 'మగధీర'లో వీరత్వం చూపించినా.. "చెవుల్లో చేరిన మాట గుండెల్లోనే ఉండిపోతుంది" అంటూ 'రంగస్థలం'లో అద్భుత నటనతో మెప్పించినా అది రామ్ చరణ్‌కే సొంతం. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి.. తొలి చిత్రంతోనే మెగా పవర్‌స్టార్ అనిపించున్నారు చరణ్. తన పేరు ముందు నాన్న, బాబాయ్‌ల ట్యాగ్ తగిలించుకున్న ఈ హీరో.. ఆ అంచనాలు తగ్గకుండా దినదినాభివృద్ది చెందుతూ నటనలో పరిపక్వత చూపిస్తూ దూసుకెళ్తున్నారు. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రామ్ చరణ్.. 1985, మార్చి 27న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించారు. చరణ్‌కు ఇద్దరు సోదరీమణులు శ్రీజ, సుష్మిత. 2012, జూన్ 14న ఉపాసన కామినేనిని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.
తండ్రికి తగ్గ తనయుడు
చరణ్.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినీ రంగప్రవేశం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమా 'చిరుత'తో డ్యాన్స్, ఫైట్స్‌తో అలరించిన ఈ స్టార్.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. రెండో సినిమా 'మగధీర'తో అందనంత ఎత్తుకు ఎదిగారు. ఎప్పుడూ సరికొత్త కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడీ మెగా హీరో. 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన చరణ్ 12 సినిమాలు చేశారు. మెగాస్టార్ నటించిన 'ఖైదీ నెంబర్ 150'లో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తోన్న 'ఆచార్య'లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాలీవుడ్లో పోలీస్ పవర్..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ 'జంజీర్' సినిమాను అదే పేరుతో రీమేక్ చేశారు. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించారు. కాకపోతో సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటించింది.
నిర్మాతగానూ హిట్టే..
నటుడిగానే కాక నిర్మాతగానూ విజయాన్ని సాధించారు రామ్ చరణ్. చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150'తో పాటు 'సైరా' చిత్రాన్ని నిర్మించి ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం 'ఆచార్య'తో నిర్మాతగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
భారీ మల్టీస్టారర్‌లో
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు చరణ్. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. శుక్రవారం ఈ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేయగా దానికి విశేష స్పందన లభించింది.