ETV Bharat / sitara

మరో ప్రయోగాత్మక చిత్రంలో హన్సిక - మరో ప్రయోగాత్మక చిత్రంలో హన్సిక

నటి హన్సిక మరో ప్రయోగాత్మక చిత్రం చేసేందుకు సిద్ధమైంది. '105 మినిట్స్' పేరుతో రూపొందబోతున్న ఈ సినిమాని సింగిల్ షాట్​లో తెరకెక్కించనున్నారు.

Hansika
హన్సిక
author img

By

Published : Apr 17, 2021, 5:32 AM IST

నటి హన్సిక ప్రయోగాల బాటపట్టింది. తాజాగా '105 మినిట్స్' పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించింది. కేవలం ఒకే ఒక పాత్రతో ఈ మూవీ తెరకెక్కనుంది. సింగిల్ షాట్​లో ఎలాంటి ఎడిటింగ్​ లేకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఇలాంటి సినిమా రాలేదని అంటున్నారు దర్శకుడు రాజు దుస్సా.

రుద్రాన్ష్​ సెల్యులాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. దుర్గా కిశోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్​ను మొదలుపెడతామని చిత్రబృందం వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.