స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh), ఆది పినిశెట్టి(Aadhi Pinisetty) ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'గుడ్‌లక్ సఖి'. జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే జూన్ 3న థియేటర్లలో విడుదల చేస్తామని మార్చిలో చిత్రబృందం ప్రకటించింది. కానీ, ప్రస్తుతం సినిమాహాళ్లు మూసి ఉండడం వల్ల ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీటిపై చిత్రనిర్మాత సుధీర్ చంద్ర స్పందించారు.
'గుడ్‌లక్ సఖి''(Good Luck Sakhi) సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నామనే వార్తల్లో నిజం లేదని సుధీర్ చంద్ర తెలిపారు. రిలీజ్ గురించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
అయితే కీర్తి సురేశ్ నుంచి గతేడాది ఓటీటీలో రిలీజ్ అయిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' చిత్రాలు.. ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపర్చాయి. అందుకే 'గుడ్‌లక్ సఖి'ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారేమో!
ఇదీ చూడండి: కీర్తి సురేశ్ 'గుడ్‌లక్ సఖి' రిలీజ్ ఎప్పుడు?