ETV Bharat / sitara

'నా గర్ల్​ఫ్రెండ్​ తప్పుగా అర్థం చేసుకుంటుంది' - latest sushanth singh news updates

సుశాంత్​ సింగ్​ చనిపోయినప్పటి నుంచి అతనికి సంబంధించిన పాత వీడియోలు, ఫొటోలను.. అభిమానులు నెట్టింట పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో 'మీ గర్ల్​ఫ్రెండ్​ పేరేమిటి' అని అడిగిన ప్రశ్నకు.. సుశాంత్​ ఆశ్చర్యపోయి కొద్ది సేపు మౌనంగా ఉన్నాడు. చివరకు ఏం చెప్పాడో తెలుసా?

Sushant Singh Rajput
సుశాంత్​
author img

By

Published : Jul 6, 2020, 11:33 AM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్​కు సంబంధించిన పాత వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తూ.. మధుర స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు.

ఇటీవలే సుశాంత్​ సింగ్​, కపిల్​ శర్మ ఫ్యాన్​క్లబ్​ ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో ఓ చిన్న వీడియో క్లిప్​ వైరల్​గా మారింది. 2017, 48వ ఇంటర్నేషనల్ ఫిల్మ్​ ఫెస్టివల్​ ఆఫ్​ ఇండియా(ఐఎఫ్​ఎఫ్​ఐ) కార్యక్రమంలో రాజ్​పుత్​ అభిమానులతో ముచ్చటించినప్పటి వీడియో అది. అందులో "మీ గర్ల్​ఫ్రెండ్​ పేరేమిటి?" అని ఓ అభిమాని అడగ్గా.. సుశాంత్​ ఆశ్చర్యపోయాడు. అలా కొద్దిసేపు మౌనం పాటించి.. "నేను తర్వాత చెప్తా. ఇప్పుడు అందరి ముందు తన పేరు చెప్తే.. నన్ను అపార్థం చేసుకోవచ్చు" అంటూ సమాధానమిచ్చాడు.

ఈ వీడియోతో పాటు సుశాంత్​కు సంబంధించిన కొన్ని సరదా ఇంటర్వ్యూలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి. ఇక, సుశాంత్ చివరగా నటించిన 'దిల్​ బెచారా' చిత్రం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈనెల 6న ఈ సినిమా ట్రైలర్​ విడుదల కానుంది. ముఖేశ్​ ఛబ్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ.. డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో జులై 24న విడుదల కానుంది. సుశాంత్​పై ఉన్న ప్రేమకు నివాళిగా.. సభ్యత్వం తీసుకోకున్నా ఉచితంగా ఈ సినిమా వీక్షించేందుకు వీలు కల్పించారు.

ఇదీ చూడండి:మెగాస్టార్ చిత్రంలో రౌడీ బాయ్​.. నిజమేనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.