51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తెలుగు సినిమా 'గతం'కు గుర్తింపు లభించింది. ఈ చిత్రోత్సవంలోని ఇండియన్ పనోరమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రదర్శితం కానున్న ఏకైకా తెలుగు సినిమాగా నిలిచింది.
నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి కిరణ్ కొండమడుగుల దర్శకత్వం వహించారు. భార్గవ పోలుదాసు, రాకేష్ గాలేభే, పూజిత కురపర్తి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరాలు అందించారు.
ఇండియన్ పనోరమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మొత్తం 23 సినిమాలను ఎంపిక చేసినట్లు తెలిపింది సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. ఇందులో 'థాయెన్'(తమిళం) , 'అసురన్'(తమిళం) , 'చిచ్చొరే'(హిందీ) చిత్రాలు కూడా ఉన్నాయి. జనవరి 17న గోవాలో ఈ చలన చిత్రోత్సవ కార్యక్రమం జరగనుంది.
-
Happy to announce the selection of 23 Feature and 20 non-feature films in Indian Panorama of 51st IFFI. @MIB_India pic.twitter.com/Kx0acUZc3N
— Prakash Javadekar (@PrakashJavdekar) December 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy to announce the selection of 23 Feature and 20 non-feature films in Indian Panorama of 51st IFFI. @MIB_India pic.twitter.com/Kx0acUZc3N
— Prakash Javadekar (@PrakashJavdekar) December 19, 2020Happy to announce the selection of 23 Feature and 20 non-feature films in Indian Panorama of 51st IFFI. @MIB_India pic.twitter.com/Kx0acUZc3N
— Prakash Javadekar (@PrakashJavdekar) December 19, 2020
ఇదీ చూడండి : 22 కిలోల బరువు తగ్గిన స్టార్‌హీరో కుమార్తె!