తెలుగు చిత్ర పరిశ్రమలోని 45 ఏళ్లు పైబడిన సినీ కార్మికులను, సినీ జర్నలిస్టులను కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ తరఫున ఉచితంగా అందరికీ వ్యాక్సిన్ వేయించే సదుపాయం ప్రముఖ ఆస్పత్రి అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ దృశ్య సందేశాన్ని పంపారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
-
తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021
కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఉపాధికి దూరమైన సినీ కార్మికులను ఆదుకునేందుకు గతేడాది తెలుగు చలన చిత్ర పరిశ్రమ కదిలివచ్చింది. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన 'కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం' పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నటీనటులు, దర్శక నిర్మాతలు ఇచ్చే విరాళాలను ఈ కమిటీ ద్వారా కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు. వారికి నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు.