కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్ గౌడ.. ఇప్పటికే శాండల్‌వుడ్‌లో హీరోగా పలు చిత్రాలు చేశాడు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఓ కొత్త ప్రాజెక్టులో నటిస్తున్నట్లు వెల్లడించాడు. బాస్కెట్‌బాల్ కథాంశంతో ఈ సినిమా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. తెలుగు-కన్నడలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
'గుండెజారి గల్లంతయ్యిందే' ఫేమ్ విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ సంస్థ లహరి మ్యూజిక్.. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. సంగీత దర్శకుడు అర్జున్ జన్య స్వరాలు సమకూర్చుతున్నాడు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.