తమిళనాడు ముఖ్యమంత్రిగా, నటిగా జయలలితకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ఆమె జీవితం ఆధారంగా 'క్వీన్' టైటిల్‌తో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌లుక్ శనివారం విడుదలైంది.
వేదికపై నిలబడి ప్రసంగిస్తున్న జయ పాత్రధారి రమ్యకృష్ణ లుక్.. వెబ్ సిరీస్‌పై అంచనాలు పెంచుతోంది. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉన్న 'క్వీన్'.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
జయలలిత జీవితం ఆధారంగా ఇప్పటికే ఓ బయోపిక్ తీస్తున్నారు. ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఏఎల్ విజయ్ దర్శకుడు.
ఇదీ చూడండి: వర్షంలో సైకిల్‌పై సల్మాన్‌ఖాన్ సవారీ!