ETV Bharat / sitara

నిజమైన బాక్సర్లతో ఫర్హాన్‌ పోరాటం! - ఫర్హాన్​ అక్తర్​ నిజమైన బాక్సర్లతో

'తుపాన్'​ సినిమా కోసం నిజమైన బాక్సర్లతో తలపడుతున్నాడట ఈ చిత్ర హీరో ఫర్హాన్​ అక్తర్! క్లైమాక్స్​లో ఓ విదేశీ బాక్సర్​తో ఫైట్​ చేసేందుకు చాలా కష్టపడుతున్నాడని తెలిసింది. ఒక వీధి రౌడీ అనేక పరిణామాల మధ్య చివరకు ఎలా జాతీయస్థాయి బాక్సర్‌ కాగలిగాడనేది చిత్ర కథాంశం. మే 21న నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుందీ సినిమా.

farhan aktar
ఫర్హాన్‌ పోరాటం
author img

By

Published : Mar 28, 2021, 2:57 PM IST

సినిమాల్లో కొన్ని సన్నివేశాలు సహజసిద్ధంగా రావాలంటే రియల్‌ స్టంట్స్‌ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆటల నేపథ్యంలో సాగే సినిమాల్లో నాటకీయత పెంచితే ప్రేక్షకులకు రుచించదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ 'తుపాన్‌' చిత్రంలో ప్రొఫెషనల్‌ బాక్సర్లతో తలపడ్డాడు. ఇందుకోసం హరియాణా, మహారాష్ట్రకు చెందిన బాక్సర్లతో పాటు ఒక విదేశీ బాక్సర్‌నూ సినిమాలో నటింపజేశారు. ఆ విదేశీ బాక్సర్‌తోనే క్లైమాక్స్ ఫైట్‌ ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ముఖ్యంగా ఆ సన్నివేశాల కోసం ఫర్హాన్ ఎంతో కష్టపడ్డాడట.

ఒక వీధి రౌడీ అనేక పరిణామాల మధ్య చివరకు ఎలా జాతీయస్థాయి బాక్సర్‌ కాగలిగాడనేది చిత్ర కథాంశం. పరేశ్‌ రావల్‌, మృనాల్‌ ఠాకూర్‌, సుప్రియా పాఠక్‌ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మే 21న నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రానికి రాకేష్‌ ఓం ప్రకాష్ మెహ్రా సహనిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో మెహ్రా-ఫర్హాన్‌ కాంబోలో వచ్చిన 'భాగ్‌ మిల్కా భాగ్‌' ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇటీవలే విడుదలైన 'తుపాన్‌' టీజర్‌పై బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

ఇదీ చూడండి : అంతరిక్షయాత్రికుడు బయోపిక్​లో ఫర్హాన్ అక్తర్?​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.