ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. అనారోగ్యంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం మృతిచెందారు. 52 ఏళ్ల నర్సింగ్ యాదవ్.. 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు నర్సింగ్ యాదవ్. విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన 'హేమాహేమీలు' చిత్రంలో అరంగేట్రం చేశారు. నటుడిగా నర్సింగ్ యాదవ్‌కు బ్రేక్ ఇచ్చారు రాంగోపాల్ వర్మ. 'క్షణక్షణం', 'గాయం', 'మనీ మనీ', 'ఠాగూర్', 'మాస్', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాలతో గుర్తింపు పొందారు.
'శంకర్‌దాదా ఎంబీబీఎస్', 'మాస్టర్' చిత్రాల్లో నటించి మెప్పించారు నర్సింగ్ యాదవ్. 'పోకిరి', 'యమదొంగ', 'అన్నవరం', 'జానీ', 'సై' చిత్రాల్లో నటనతో ఆకట్టుకున్నారు.
ఇదీ చూడండి: సినీనటుడు నర్సింగ్యాదవ్కి తీవ్ర గాయాలు