ETV Bharat / sitara

సమీక్ష: 'ఎంత మంచివాడవురా' ఎలా ఉందంటే..! - entha manchivadavura released today

నందమూరి కల్యాణ్​రామ్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎంత మంచివాడవురా'. సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

Entha
ఎంత
author img

By

Published : Jan 15, 2020, 12:56 PM IST

Updated : Jan 15, 2020, 1:55 PM IST

కుటుంబ క‌థా చిత్రాల‌పై మక్కువ పెంచుకుంటున్నారు యువ క‌థానాయ‌కులు. ఇంటిల్లిపాదిని మెప్పించ‌డంలో ఉన్న ఆనందమే వేర‌ని వాళ్లు న‌మ్ముతున్నారు. అందుకే అవ‌కాశం రాగానే.. మాస్ మంత్రం జ‌పించ‌డం వ‌దిలి, కుటుంబ క‌థ‌ల‌కి ప‌చ్చజెండా ఊపుతున్నారు. ఆ జాబితాలోకి క‌ల్యాణ్‌రామ్ కూడా చేరారు. ‘118’తో గ‌తేడాది విజ‌యాన్ని అందుకున్న ఆయ‌న ఈసారి ‘ఎంత మంచివాడ‌వురా’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సంక్రాంతి సినిమాల్లో భాగంగా వ‌స్తున్న ఆఖ‌రి సినిమా ఇది. 'శ‌త‌మానం భ‌వ‌తి'తో ఇంటిల్లిపాదినీ మెప్పించిన స‌తీష్ వేగ‌శ్న ద‌ర్శక‌త్వం వ‌హించారు. పండ‌గ సంద‌డి... కుటుంబ క‌థ కావ‌డం వల్ల ఈ సినిమాపై కూడా మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? క‌ల్యాణ్‌రామ్ కుటుంబ క‌థ‌లో ఎలా ఒదిగిపోయారు అనేది సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

క‌థేంటంటే:

చిన్నప్పుడే బంధాల విలువ తెలుసుకుంటాడు బాలు (క‌ల్యాణ్‌ రామ్‌). త‌న చిన్ననాటి స్నేహితురాలైన నందిని (మెహ‌రీన్‌)తో క‌లిసి ల‌ఘు చిత్రాలు చేస్తుంటాడు. త‌న స్నేహితులంద‌రికీ అత‌ను బాలు మాత్రమే. కానీ శివ‌, సూర్య, రిషి... ఇలా ర‌క‌ర‌కాల పేర్లతో ఒక వృద్ధ జంట‌కి మ‌న‌వ‌డిగా, ఒకరికి కొడుకుగా, మ‌రొక‌రికి త‌మ్ముడిగా ఉంటూ అనుబంధాల్ని కొన‌సాగిస్తుంటాడు. ఎవ‌రూ లేని బాలు అలా వేరే వేరే పేర్లతో అన్ని కుటుంబాల‌కి ఎలా ద‌గ్గర‌య్యాడు. ఆచార్య పేరుతో మ‌రొక‌రి ఇంటికి వెళ్లాక ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. ఇంత‌కీ బాలు ల‌క్ష్యమేమిటి? బాలుని ప్రేమించిన నందిని అత‌నితో జీవితాన్ని పంచుకుందా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎలా ఉందంటే:

బంధాలు.. అనుబంధాల చుట్టూ క‌థ సాగిందంటే మ‌న‌సుల్ని స్పృశించే భావోద్వేగాలు పండుతాయి. కుటుంబ క‌థా చిత్రాలు తెర‌కెక్కించడానికి కార‌ణం అదే. తెర‌పై క‌నిపించే పాత్రల‌తో ప్రేక్షకుడు ఎక్కడో ఒక చోట త‌నని తాను చూసుకుంటాడు. అందులోనే కుటుంబ క‌థా చిత్రాల విజ‌యం దాగి ఉంటుంది. ఈ క‌థ అయితే నేరుగా భావోద్వేగాల‌తో ముడ‌ప‌డిన‌దే. అయిన‌వాళ్లకి దూర‌మైన మనుషుల‌కి ఆ లోటు తెలియ‌కుండా, ఆ బంధాల్ని భావోద్వేగాల్ని అందించ‌డ‌మే ఇందులో క‌థానాయ‌కుడి ప‌ని. అలాంట‌ప్పుడు మ‌రిన్ని భావోద్వేగాలు పండాలి. ప్రతి స‌న్నివేశం హృద‌యాల్ని స్పృశించాలి. ఆ విష‌యంలో ఈ సినిమా కొద్ది మేర‌కే ప్రభావం చూపిస్తుంది. పండాల్సిన చోట భావోద్వేగాలు పండ‌లేదు. ప్రేక్షకుడిని క‌థ‌లో లీనం చేయ‌డానికి చేసిన ప్రయ‌త్నాలు పెద్దగా ఫ‌లించ‌లేదు. మెహ‌రీన్ ఫ్లాష్ బ్యాక్‌తో క‌థ మొద‌లవుతుంది. అందులో హీరోహీరోయిన్ల చిన్ననాటి క‌థ ఉంటుంది. క‌థానాయ‌కుడు అన్ని పేర్లతో ఎందుకు చ‌లామ‌ణీ అవుతున్నాడు, అత‌ను ఏం చేస్తున్నాడ‌నే విష‌యం బ‌య‌టికొచ్చాకే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. బంధాల్ని స‌ర‌ఫ‌రా చేసే సంస్థని ప్రారంభించాక ప్రేక్షకుడిలో ర‌క‌ర‌కాల సందేహాలు ఉత్పన్నమ‌వుతాయి. వాటికి త‌గ్గట్టుగానే తెర‌పై స‌న్నివేశాలొస్తుంటాయి. నిజంగా ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి బంధం కావాల‌ని వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌నే ప్రశ్నలకి జ‌వాబు అన్నట్టుగా కొన్ని స‌న్నివేశాలు సాగుతాయి.

క‌థానాయ‌కుడు ఆచార్యగా త‌నికెళ్ల భ‌ర‌ణి ఇంటికి వెళ్లాకే క‌థ‌లో మ‌రింత సంఘ‌ర్షణ ఏర్పడుతుంది. అక్కడ ఇసుక మాఫియా నాయ‌కుడు గంగ‌రాజు (రాజీవ్ క‌న‌కాల‌)ని ఎదిరించే సంఘ‌ట‌న‌ల‌తో విరామ స‌న్నివేశాలొస్తాయి. ప్రథ‌మార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం కాస్త ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. త‌నికెళ్ల భ‌ర‌ణికీ, ఆయ‌న కొడుకు ఆచార్యగా న‌టిస్తున్న క‌ల్యాణ్‌ రామ్‌కీ మ‌ధ్య స‌న్నివేశాలు హ‌త్తుకుంటాయి. అలాగే శ‌ర‌త్‌ బాబు, సుహాసిని, క‌ల్యాణ్‌ రామ్‌ల మ‌ధ్య స‌న్నివేశాలు కూడా మెప్పిస్తాయి. వెన్నెల కిషోర్ పాత్ర ప్రవేశించాక న‌వ్వులు పండాయి. ప‌తాక స‌న్నివేశాలు మాత్రం నాట‌కీయంగా అనిపిస్తాయి. స‌హ‌జత్వం లేని స‌న్నివేశాలు, ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టుగా సాగే క‌థ‌నం ఏమాత్రం ఆస‌క్తిని రేకెత్తించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే:

క‌ల్యాణ్‌రామ్, మెహ‌రీన్ పాత్రలే ఈ సినిమాకి కీల‌కం. వాళ్లిద్దరూ చ‌క్కటి అభిన‌యం ప్రదర్శించారు. కుటుంబ క‌థ‌ని తొలిసారి చేసిన క‌ల్యాణ్‌రామ్ అందుకు త‌గ్గట్టుగా, ఇది వ‌ర‌క‌టి సినిమాల‌కి భిన్నంగా క‌నిపించే ప్రయ‌త్నం చేశారు. భావోద్వేగాలు పంచారు. మెహ‌రీన్ కూడా మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచారు. త‌నికెళ్ల భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, సుహాసిని, శ‌ర‌త్‌బాబు, విజ‌య్ కుమార్ల పాత్రలు కూడా మెప్పిస్తాయి. వెన్నెల‌ కిషోర్ న‌వ్విస్తారు. న‌రేష్, ప్రవీణ్‌, ప్రభాస్ శ్రీను, భ‌ద్రం త‌దిత‌రులున్నా వాళ్ల పాత్రలు పెద్దగా మెప్పించ‌లేక‌పోయాయి. సాంకేతిక విభాగంలో గోపీసుంద‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ఏమో ఏమో, ఔనో కాదో తెలియ‌ని.. పాట‌లు అల‌రిస్తాయి. నేప‌థ్య సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. రాజ్‌తోట కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గట్టుగా ఉన్నాయి. ‘శ‌త‌మానం భ‌వతి’తో మెప్పించిన ద‌ర్శకుడు స‌తీస్ వేగేశ్న. ఆయ‌న ఏ సినిమా చేసినా ఆ స్థాయి ప్రమాణాలు ఆశిస్తారు. త‌న‌ది కాని క‌థ కావ‌డం వల్ల ఆయ‌న ఇబ్బంది ప‌డిన‌ట్టు అనిపిస్తుంది.

బ‌లాలు

+ క‌ల్యాణ్‌రామ్‌, మెహ‌రీన్ న‌ట‌న
+ సంగీతం
+ ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- భావోద్వేగాలు
- సాగదీత‌గా సాగే స‌న్నివేశాలు
- ప‌తాక స‌న్నివేశాలు

చివ‌రిగా.. అను‘బంధాల‌’ను పంచే మంచివాడు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Available worldwide excluding Japan, Australia. MIDDLE EAST: No material may be broadcast, televised, transmitted, reported or otherwise used for any purpose whatsoever (including for news reporting) on the IRIB Network; Tunisia TV; Hallibal TV; Nessma TV; ENTV Network; ERTU Network; Nilesports or Modern Sports (within Iran, Tunisia, Algeria and Egypt).
Max use 3 minutes per day. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide.
DIGITAL: Available worldwide. Standalone digital clips allowed, but not on social media. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Melbourne Park, Melbourne, Australia - 15th January 2020
Men's Singles Qualifier, Dennis Novak (AUT) (1) v Dustin Brown (GER)
1. 00:00 exterior of Melbourne Park
2. 00:05 player at centre court
3. 00:09 1st set, Dennis Novak scores at net to lead 15-0 (2-2)
4. 00:21 1st set, Dennis Novak serves and scores at net to lead 40-15 (4-3)
5. 00:34 2nd set, match point, Dennis Novak wins 6-3, 6-2 to advance
Women's Singles Qualifier, Reka-Luca Jani (HUN) v Allie Kiick (USA) (28)
5. 00:52 players at centre court
6. 00:59 1st set, Alli Kiick scores at net to set up set point at 6-5
7. 01:13 Allie Kiick receiving injury treatment between sets
8. 01:19 2nd set, Reka-Luca Jani scores on backhand at net for deuce at 2-2
9. 01:31 2nd set, match point, Allie Kiick wins 7-5, 6-3
SOURCE: Tennis Australia
DURATION: 01:53
STORYLINE:
Top seed Dennis Novak of Austria defeated Germany's Dustin Brown 6-2, 6-3 in his opening Australian Open qualifier on Tuesday in Melbourne.
28th seeded American Allie Kiick fought through an an injury to defeat Reka-Luca Jani of Hungary in her opening match 7-5, 6-3.    
Last Updated : Jan 15, 2020, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.