ETV Bharat / sitara

రెండేళ్ల తర్వాత బాలీవుడ్​కు దుల్కర్​ సల్మాన్​! - దుల్కర్​ సల్మాన్​ బాలీవుడ్​

దాదాపు రెండేళ్ల తర్వాత బాలీవుడ్​లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్​. దర్శకుడు ఆర్​.బాల్కీ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లర్​ సినిమాలో దుల్కర్​ నటించనున్నారని సమాచారం. ఈ ఏడాది మార్చిలోగా షూటింగ్​ ప్రారంభించినున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Dulquer Salmaan all set for another Bollywood outing - deets inside
రెండేళ్ల తర్వాత బాలీవుడ్​కు దుల్కర్​ సల్మాన్​
author img

By

Published : Jan 18, 2021, 1:18 PM IST

బాలీవుడ్​లో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్​. దర్శకుడు ఆర్​.బాల్కీ చెప్పిన కథ నచ్చడం వల్ల దానికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే రెండేళ్ల తర్వాత బాలీవుడ్​లో దుల్కర్​ సల్మాన్​ చేసే సినిమా అదే కాబోతోంది.

థ్రిల్లర్​ నేపథ్యంలో రూపొందనున్న చిత్రాన్ని ఈ ఏడాది మార్చిలోగా సెట్స్​పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. దర్శకుడు బాల్కీ.. ఇదివరకు 'పా', 'చీని కుమ్​', 'కీ అండ్​ కా' ​వంటి విభిన్న చిత్రాలను రూపొందించారు.

2018లో దర్శకుడు అవినాశ్​ రాజ్​పురోహిత్​ తెరకెక్కించిన 'కార్వాన్​' సినిమాతో దుల్కర్​ సల్మాన్​ బాలీవుడ్​కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ది జోయా ఫ్యాక్టర్​'లోనూ ఆయన నటించారు. దుల్కర్​.. ప్రస్తుతం మలయాళ చిత్రం 'కృప్'​తో పాటు.. 'హే సినామికా' అనే తమిళ చిత్రంతో బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: విజయ్​ దేవరకొండ కొత్త చిత్రం 'లైగర్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.