"మనుషులకే కాదు... మనసుకు చుట్టాలుంటారు" అని అంటున్నాడు దర్శకుడు సతీశ్ వేగేశ్న. 'శతమానం భవతి', 'శ్రీనివాస కళ్యాణం' తర్వాత కల్యాణ్‌రామ్‌తో కలిసి ఈ డైరెక్టర్ చేసిన చిత్రం 'ఎంత మంచివాడవురా'. గుజరాతీ సినమా 'ఆక్సిజన్'కు రీమేక్‌గా తెరకెక్కించారు.
ఇందులో మెహరీన్ హీరోయిన్గా నటించింది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మించింది. సంక్రాంతి కానుకగా రేపు(బుధవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సతీశ్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.