ETV Bharat / sitara

మాస్​కు కేరాఫ్​ అడ్రస్​.. దర్శకుడు పూరీ జగన్నాథ్ - దర్శకుడు పూరీ జగన్నాథ్

మాస్​ చిత్రాలతో గుర్తింపు పొందిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పూరీపై ప్రత్యేక కథనం.

దర్శకుడు పూరీ జగన్నాథ్
author img

By

Published : Sep 28, 2019, 5:31 AM IST

Updated : Oct 2, 2019, 7:28 AM IST

ఎవరు సినిమా తీస్తే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందో... అతడే పూరీ జగన్నాథ్‌. సినిమాను విభిన్న శైలిలో తీస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడీ డైరక్టర్. మాస్ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచిన పూరీ.. నేడు 54వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా పూరీపై ప్రత్యేక కథనం.

puri birthday common dp
దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు కామన్ డీపీ

తిట్లే అతడి సినిమా టైటిల్స్..!
పోకిరి, ఇడియట్, దేశముదురు ఇలాంటి వాటిని టైటిల్స్​గా పెట్టాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. కానీ పూరీ మాత్రం వీటినే టైటిల్స్​గా పెట్టి హిట్​లు కొట్టాడు.

ఇంటి పేరు పూరీ కాదు..!
ఈ దర్శకుడు ఇంటి పేరు పెట్ల. కానీ పూరీ జగన్నాథ్​ గానే అందరికీ సుపరిచితం. పూరీ జగన్నాథుడు ఆరాధ్య దైవం కావడం వల్లే ఆ పేరు పెట్టుకున్నాడు.

ఆర్​జీవీ అసిస్టెంట్​గా ఇండస్ట్రీలోకి

puri with rgv
దర్శకుడు రామ్​గోపాల్​ వర్మతో పూరీ జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సహాయకుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు పూరీ. తెలుగులో పలు చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు కన్నడలోనూ పనిచేశాడు. పునీత్ రాజ్​కుమార్​ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరీనే కావడం విశేషం. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తోనూ పనిచేసిన ఘనత ఈ డైరెక్టర్‌ సొంతం.

పవన్‌తో సినీ కెరీర్‌ ప్రారంభం

తన కెరీర్​ను పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ 'బద్రి'తో ఆరంభించిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత బాచి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, ఆంధ్రావాలా, పోకిరి, బుజ్జిగాడు, దేశముదురు, నేనింతే, గోలీమార్‌, బిజినెస్‌మేన్‌, ఇద్దరమ్మాయిలతో, హార్ట్‌ ఎటాక్‌, టెంపర్, మెహబూబూ, ఇస్మార్ట్​ శంకర్​ వంటి సినిమాలతో గుర్తింపు పొందాడు.

DIRECTOR PURI JAGANNADH
దర్శకుడు పూరీ జగన్నాథ్

పురస్కారాలు
'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రానికి ఉత్తమ సంభాషణ రచయితగా నంది అవార్డు గెలుచుకున్నాడు పూరీ జగన్నాథ్. 'పోకిరి' సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్‌ అవార్డు, సంతోషం అవార్డు అందుకున్నాడు. 'నేనింతే' సినిమాకి ఉత్తమ సంభాషణ రచయితగా మరో నంది పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా తీస్తున్నాడు పూరీ. ఈ చిత్రానికి 'ఫైటర్'​ అనే టైటిల్​ను పరిశీలిస్తున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Kumamoto, Japan. 27th September, 2019
+++ TO FOLLOW +++
SOURCE: SNTV
DURATION: 02:02
STORYLINE:
France held a training session in Kumamoto on Friday as they prepare for Pool C meeting with USA.
Last Updated : Oct 2, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.