ETV Bharat / sitara

అదే నా బలం.. నా శైలి అంతే: మారుతి - మంచి రోజులు వచ్చాయి రిలీజ్ డేట్

తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూనే సందేశం ఇవ్వగల దర్శకుడు మారుతి(maruthi director movies). ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'(manchi rojulu vachayi release date). ఈ సినిమా నేడు (నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించిన మారుతి.. పలు విషయాలు పంచుకున్నారు.

Maruthi
మారుతి
author img

By

Published : Nov 4, 2021, 6:44 AM IST

చిన్న సినిమాలతో ఎదిగిన దర్శకుడు మారుతి(maruthi director movies). స్టార్లతో చిత్రాలు తీస్తున్నా.. ఆయన చిన్న సినిమాని మరిచిపోలేదు. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా 'మంచి రోజులు వచ్చాయి'(manchi rojulu vachayi release date). సంతోష్‌శోభన్‌, మెహ్రీన్‌ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా గురువారం(నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆయన బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

మనసులకి వ్యాక్సిన్‌ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఏమిటా కథ?

మధ్య తరగతి మనుషుల్లో రకరకాల భయాలు కనిపిస్తుంటాయి. తన కూతురు విషయంలో కొన్ని భయాలున్న ఓ మధ్య తరగతి తండ్రికి, కరోనా భయం తోడైతే ఎలా ఉంటుందో ఆలోచించి రాసిన కథ ఇది. అంతే తప్ప కరోనా కథ కాదిది. అదొక చిన్న అంశమే. 2020 ఫిబ్రవరి చివర్లో ఒక కాలనీలో జరిగిన కథలా చేశా. భయం రోగం కంటే పెద్దది. కరోనా తెచ్చిన ముప్పు కంటే కూడా, పక్కనోళ్లకి ఇలా అయ్యిందంట అనే మాటలు విని ఆ భయాలతో మానసికంగా తమని తాము చంపుకొన్నవాళ్లే ఎక్కువ. అలాంటి ఒక భయస్తుడి చుట్టూ అల్లిన కథ ఈ సినిమా. ఎవడి పరిస్థితులు వాళ్లవి, ఎవరి ఆరోగ్యం వాళ్లది. వేరేవాళ్ల భయంతో మనం ఎందుకు పోల్చుకోవడం? ఎదుటివాళ్లు జాగ్రత్తలు చెప్పినా వాటిని ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకోవాలనే అంశాన్ని ఇందులో చర్చించాం.

ఎప్పట్లాగే వినోదం పూత పూసి ఓ సందేశం ఇచ్చారన్నమాట?

నా శైలి అదే. ఒక విషయాన్ని సీరియస్‌గా చెప్పినా వింటారేమో కానీ, మారుతి అనగానే నవ్విస్తాడనే ఓ నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది కదా. నవ్విస్తూనే నేను ప్రేక్షకులకు చెప్పదలచుకున్నది చెబుతా. సినిమా అనేది ఓ సామాజిక బాధ్యత అని బలంగా నమ్ముతాను. మనం సమాజానికి ఏం చెప్పామని ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు సమాధానం దొరకాలి. పరిశుభ్రత, భయం, మతిమరుపు, ఇగోలు, జాలి దయ... ఇలా వీటన్నిటి మీద సినిమా తీశాననే తృప్తి నాకు ఉంది.

పెద్ద సినిమా తీస్తున్న సమయంలో పరిమిత వ్యయంతో కూడిన ఇలాంటి చిత్రాలు తీసి, తీరా అవి సరైన ఫలితాన్ని తీసుకురాకపోతే మీ కెరీర్‌పై ప్రభావం పడదా?

రూ.35 కోట్ల వ్యయంతో సినిమాలు తీస్తున్న నేను, ఉన్నట్టుండి రూ.100 కోట్లు పెట్టి తీస్తున్నానంటే భయాలొస్తాయేమో కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. 'మంచి రోజులు వచ్చాయి' ఇప్పటికే లాభాలు తీసుకువచ్చిన సినిమా. కరోనా సమయంలో 30 రోజుల్లో తక్కువ బడ్జెట్‌లో తీశాం, 150మందికి ఉపాధి కల్పించాం. నాకు కావల్సిన పారితోషికం నేను అందుకున్నా. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన రకరకాల మార్కెట్లవల్ల మా సినిమా థియేటర్‌లోకి రాకముందే లాభాల్ని తెచ్చిపెట్టింది. సరదాగా థియేటర్‌లో విడుదల చేస్తున్నామంతే. ప్రేక్షకులు చూసి మారుతి మంచి ప్రయత్నం చేశాడని, బాగుందని అంటే చాలు. ఇలాంటి ప్రయత్నాలు నేనెన్ని చేసినా నా కెరీర్‌కి వచ్చిన ఢోకా ఏమీ ఉండదు.

చిన్న సినిమాలు చేయడంలో మీకుండే సౌలభ్యాలు ఏమిటి?

వాస్తవికత ఏమిటో తెలుస్తుంది. వనరులు చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇన్ని పరిమితులు ఉన్నా నాకు చిన్న సినిమా అంటే చాలా ఇష్టం. పెద్ద సినిమాకి అన్నీ ఉన్నా, నటీనటులు మొదలుకొని ప్రతి విషయంలోనూ ప్లానింగ్‌ ప్రకారమే వెళ్లాలి. ఓ ప్రోటోకాల్‌ ఉంటుంది. ఇక్కడ నటీనటులు, సాంకేతిక బృందం అంతా అందుబాటులో ఉంటుంది. అందుకే మేం 30 రోజుల్లోనే పూర్తి చేశాం. అయితే చిన్న సినిమా ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మెల్లమెల్లగా కనుమరుగవుతూ ఉంది. పెద్ద సినిమాలే ఓటీటీకి వస్తున్న ఈ పరిస్థితుల్లో చిన్న సినిమాకోసం థియేటర్‌కి ఎందుకొస్తారు? చిన్న సినిమా బతకాలంటే మనం చేస్తూనే ఉండాలి. పెద్ద దర్శకులు చిన్న సినిమాలు తీస్తే వాళ్ల అభిమానులో లేదంటే ఇతరత్రా ఆసక్తితోనే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. థియేటర్లని బతికికుంచుకుందాం అనే ఆలోచన ఉన్న దర్శకులు చిన్న, మధ్యస్థమైన సినిమాలు తీస్తూనే ఉండాలి. నేను, నా మిత్రుడు ఎస్‌.కె.ఎన్‌ మాస్‌ మూవీ మేకర్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేశాం. అందులో ఇక నుంచి సినిమాలు చేస్తూనే ఉంటాం.

'పక్కా కమర్షియల్‌' కోర్ట్‌ రూమ్‌ డ్రామానా? అది ఎంతవరకు వచ్చింది?

చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదల ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. అది కోర్ట్‌ రూమ్‌ డ్రామానే, అయితే నా శైలి అంశాలు ఉంటాయి.

తదుపరి విశేషాలేమిటి?

కథలపై దృష్టిపెట్టాను. చిరంజీవి సర్‌తో సినిమా ఉంటుంది. కథ చెప్పా. ఆయనకి చాలా బాగా నచ్చింది. నేను, చిరంజీవి సర్‌ కలిస్తే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే తరహాలో ఉంటుంది. మారుతి అంటే వినోదం అని ఫిక్స్‌ అయిపోవాలంతే.

మారుతీ కామెడీ అంటూ మీదైన ఓ ముద్ర వేశారు. అది ప్లస్‌ అని భావిస్తారా? భారం అనిపిస్తుందా?

మారుతి బ్రాండ్‌, మారుతి కామెడీ, మారుతిలా చేశాడనే మాటలు వినిపిస్తాయంటే నా శైలి ప్రేక్షకులకు చేరువైందనే అర్థం. నా నవ్వులు చూసి జనం వచ్చారు. నన్ను పెంచారు, నా కామెడీని పెంచారు. నువ్వు కామెడీ చెయ్యమని ప్రోత్సహించారు. దాన్ని నేనెప్పుడూ వదులుకోకూడదు. ఎప్పటికీ అది నా బలమే.

ఇవీ చూడండి: 'రాధేశ్యామ్'కు సీక్వెల్.. క్లారిటీ అప్పుడే..!?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.