ETV Bharat / sitara

Kondapolam movie: 'పవన్​ ప్రోత్సాహం వల్లే ఈ సినిమా​' - kondapolam trailer

పవన్​కల్యాణ్​(kondapolam movie) ప్రోత్సహించడం వల్లే 'కొండపొలం' సినిమా సాధ్యమైందని అన్నారు దర్శకుడు క్రిష్(kondapolam movie director)​. కాగా, ఈ చిత్రంలోని రవీంద్ర పాత్రలాగే ఎప్పుడూ తలెత్తుకుని మనమంతా దేశానికి గర్వకారణంగా నిలవాలని చెప్పారు హీరో వైష్ణవ్​ తేజ్​. ఈ మూవీ అక్టోబర్​ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

kondapolam
కొండపొలం
author img

By

Published : Oct 3, 2021, 6:42 AM IST

"జీవితంలో(kondapolam movie) ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా తల పైకెత్తే నిలవాలని చెప్పే కథ ఇది. ఇందులోని రవీంద్ర మనలో ఒకడిగా కనిపిస్తాడు. రయ్‌ రయ్‌ రయ్యా రయ్‌... అనే తన మంత్రం అందరి జీవితాల్లో ఉపయోగపడుతుందని నమ్ముతున్నా" అన్నారు వైష్ణవ్‌తేజ్‌(vaishnav tej kondapolam). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'కొండపొలం'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. క్రిష్‌ దర్శకత్వం వహించారు. సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కర్నూలులో పాటల విడుదల వేడుక జరిగింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కథానాయకుడు వైష్ణవ్‌తేజ్‌(vaishnav tej kondapolam) మాట్లాడుతూ "నా రెండో సినిమాకే కీరవాణి సర్‌ స్వరాలు సమకూర్చడం నా అదృష్టం. రవీంద్ర పాత్రలాగే ఎప్పుడూ తలెత్తుకుని మనమంతా దేశానికి గర్వకారణంగా నిలవాలి" అన్నారు. దర్శకుడు క్రిష్‌(kondapolam movie director) మాట్లాడుతూ "ఈ సినిమా విషయంలో నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన మొట్ట మొదటి వ్యక్తి పవన్‌కల్యాణ్‌. భారీ సినిమా జరుగుతున్నప్పుడు కొంచెం విరామం వస్తే... ఇలా ఒక సినిమా చేసొస్తామంటే ప్రోత్సహించారు. దర్శకులు సుకుమార్‌, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ పుస్తకం గురించి చెప్పక పోయినా, సీమబిడ్డ తెలుగు రచయిత సన్నపురెడ్డి 'కొండపొలం' పుస్తకం(kondapolam story) రాయకపోయినా ఈ సినిమా మొదలయ్యేది కాదు. నిర్మాత రాజీవ్‌కు ఈ కథ గురించి చెబితే వెంటనే చేద్దాం అన్నారు. దీన్ని పైమెట్టులో పెట్టిన వ్యక్తి ఎమ్‌.ఎమ్‌.కీరవాణి. రయ్‌ రయ్‌ అంటూ సంగీతంతో మంత్రం వేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి 'ఎత్తు తల ఎత్తు... పడదోసే సంద్రపు నీలం, ఎగదోసే గగనపు నీలం... అలసిందా ఎగసిందా అల..అలలాంటిది కాదా నీ తల' అంటూ గొప్ప సాహిత్యాన్ని అందించార"న్నారు.

కీరవాణి మాట్లాడుతూ "మనకు నీరసం వచ్చినప్పుడు, అపనమ్మకం కలిగినప్పుడు అనుకోవల్సిన మంత్రం 'రయ్‌ రయ్‌ రయ్యా రయ్‌..' అంటూ ఈ సినిమాలో కంపోజ్‌ చేశాను. అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన సీతారామశాస్త్రికి కృతజ్ఞతలు" అన్నారు. సాయిచంద్‌ మాట్లాడుతూ "తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకీ చాలా అనుబంధం ఉండేది. చాలా ఏళ్ల కిందట అది తెగిపోయింది. ఈ సినిమాతో ఆ బంధాన్ని మళ్లీ కలిపారు క్రిష్‌" అన్నారు. కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ "నల్లమల కొండల్లో ఓ యువకుడు సాగించిన ప్రయాణమే ఈ సినిమా. రాయలసీమ కథ అంటే ఫ్యాక్షన్‌ కథ అనే ముద్రపడింది. అలా కాకుండా... సాధారణ రైతులు, వ్యవసాయదారులు, గొర్రెలకాపరుల బాధల్ని, కష్టాల్ని ప్రతిబింబించే కథ ఇది" అన్నారు. నిర్మాత రాజీవ్‌రెడ్డి, రవిప్రకాశ్‌, ఆంథోనీ, హేమ, మహేష్‌ విట్టా, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: చీరకట్టులో నివేదా.. మెస్మరైజ్ చేస్తున్న సారా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.