ETV Bharat / sitara

దర్శకుడు క్రిష్​ సినీజీవితంపై ప్రత్యేక కథనం.. - krish jagarlamudi birthday special story

'గమ్యం' సినిమాతో తెలుగు పరిశ్రమలో కెరీర్​ ప్రారంభించి.. అనేక వైవిద్యభరిత చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు క్రిష్​. ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ ప్రయాణంపై ప్రత్యేక కథనం మీ కోసం.

krish
క్రిష్​
author img

By

Published : Sep 10, 2020, 6:01 AM IST

Updated : Sep 10, 2020, 8:17 AM IST

ఆయన ప్రపంచం సినిమా. ఆయన 'గమ్యం' సినిమా. ఆయన నిత్యపారాయణ గ్రంథం సినీ 'వేదం'. తీసిన ప్రతి సినిమా ఓ ఆణిముత్యం. అటు ఇండస్ట్రీ పెద్దల్ని, ఇటు ప్రేక్షకులని విస్మయానందానికి గురిచేస్తూ.. దశాబ్దాల పాటు స్మరించుకునే సృజనాత్మక దర్శకుడిగా ఆయన తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు ఎన్నటికీ వన్నె తగ్గనివి. ఆయనే క్రిష్‌. పూర్తి పేరు రాధాకృష్ణ జాగర్లమూడి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1976 నవంబర్‌ 10న ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులో క్రిష్‌ పుట్టి పెరిగారు. సినిమాయే ఆశగా, శ్వాసగా.. అదే తన గమ్యంగా నిర్దేశించుకున్నారు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి కొన్ని సూపర్​ హిట్​ సినిమాలు తీసి సత్తా చాటారు.

వైవిధ్యమైన ఇతివృత్తాలు, కొన్ని భావోద్వేగాలు, కించిత్‌ తాత్వికతతో కూడిన ఆయన చిత్రాలు కేవలం మేధావులనే కాదు... సామాన్య ప్రేక్షకులనూ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2008లో పరిశ్రమలోకి అడుగుపెట్టి వైవిధ్యభరిత సినిమాలు తీస్తూ విజయాలతో పాటు కొన్ని వివాదాల్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు.

తండ్రి ద్వారా చిత్రసీమలోకి ప్రవేశం

ఎంతో మంది నిర్మాతలను కలసి 'గమ్యం' కథ చెప్పి కన్విన్స్‌ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. క్రిష్‌ని చిత్రసీమకి పరిచయం చేసింది ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబా, బాబాయ్‌ బిబో శ్రీనివాస్‌. ఈ ఇద్దరితో పాటు క్రిష్‌ స్నేహితుడు రాజీవ్‌ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యారు.

అల్లరి నరేష్, శర్వానంద్, కమలిని ముఖర్జీ తదితర తారాగణంతో తెరకెక్కిన 'గమ్యం' సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. విమర్శకుల ప్రశంసలూ అందుకుందీ చిత్రం. సినీ పరిశ్రమకు అభిరుచిగల దర్శకుడు లభించాడన్న భరోసా అందించింది. బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. ఎన్నో అవార్డులు, పురస్కారాలు గెలుచుకుంది. 2009లో ఈ సినిమాకి సౌత్‌ ఫిలింఫేర్‌ ద్వారా ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ సినిమాగా అవార్డులను సొంతం చేసుకుంది.

తెలుగులో ఇంతటి విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇతర భాషల్లోకి కూడా రీమేక్‌ అయ్యింది. ఆ తర్వాత క్రిష్‌ నుంచి వచ్చే సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా 'వేదం' వచ్చింది. 2010లో విడుదలైన ఈ సినిమాలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్‌ కీలక పాత్రలు పోషించారు.

సుమారు దశాబ్దం తర్వాత తెలుగులో విడుదలైన మల్టీస్టారర్‌ మూవీగా ఈ చిత్రం పేరు తెచ్చుకుంది. దీంతో రెండోసారి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు క్రిష్. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అనుష్క శెట్టి అవార్డులు గెలుచుకున్నారు.

తమిళంలో 'వానం'

'వేదం' సినిమా తర్వాత క్రిష్‌ తమిళంలో 'వానం' సినిమాకి దర్శకత్వం వహించారు. సిలంబరసన్‌ రాజేందర్, భరత్, అనుష్క శెట్టి ఈ చిత్రంలో ప్రధాన భూమికల్ని పోషించారు. ఈ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలు భారీగానే దక్కాయి. ఆ తర్వాత తెలుగులో రానా దగ్గుబాటి, నయనతార నటీనటులుగా 'కృష్ణం వందే జగద్గురుమ్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. 2012లో ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది.

బాలీవుడ్‌లో 'గబ్బర్‌ సింగ్‌ బ్యాక్‌'

క్రిష్‌ 'గబ్బర్‌ సింగ్‌ బ్యాక్‌' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సంజయ్‌ లీలా భన్సాలీ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని‌ నిర్మించింది. ఈ ప్రొడక్షన్‌కి బాలీవుడ్‌లో ఎంత పేరుందో చెప్పనక్కర్లేదు. 2015 ఏప్రిల్‌ 20న ఈ సినిమా విడుదలై విజయాన్ని అందుకుంది.

అక్షయ్ కుమార్, కరీనా కపూర్, శృతి హాసన్‌ ఈ సినిమాలో ప్రధాన భూమికల్ని పోషించారు. ఆ తర్వాత వరుణ్‌ తేజ్ హీరోగా తెలుగులో 'కంచె' సినిమాకి క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి సద్విమర్శలు వెల్లువెత్తాయి.

బాలకృష్ణ వందో సినిమా దర్శకుడు

బాలకృష్ణ వందో సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి'కి క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఇది చారిత్రాత్మక చిత్రం. 2017 జనవరి 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ తర్వాత.. బాలకృష్ణతో 'కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాలను రూపొందించారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ జీవిత ఆధారంగా తీసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ మంచి విజయాన్ని అందుకున్నాయి.

అనంతరం 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, సృజనాత్మక విభేదాల వల్ల ఈ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం వల్ల.. ఆ చిత్రానికి కో డైరెక్టర్​గా క్రెడిట్‌ మాత్రమే ఆయనకు దక్కింది.

ప్రస్తుతం పవర్​స్టార్​ పవన్‌కల్యాణ్​ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇటీవలే సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ పోస్టర్​ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది చిత్రబృందం. చేతికి కడియం, ఉంగరాలు పెట్టుకుని కొత్త లుక్​తో ఉన్న పవన్​ పోస్టర్​ అమితంగా ఆకట్టుకుంది.

  • @PawanKalyan గారు, #PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది..
    చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..
    ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..
    ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ #HBDPawanKalyan pic.twitter.com/PCVhIO3uxm

    — Krish Jagarlamudi (@DirKrish) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వ్యక్తిగతం

2016 ఆగస్టు 7న క్రిష్‌ వివాహం రమ్యతో జరిగింది. ఆ వివాహ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. పరస్పర అంగీకారంతోనే ఈ ఇద్దరూ విడిపోయారు.

Last Updated : Sep 10, 2020, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.