cinema updates: అందరి నోటా ఒకటే మాట.. మహేశ్.. మహేశ్! - oka chinna family story movie release date
కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. 'పలాస' ఫేం దర్శకుడు కరుణకుమార్ కొత్త చిత్రం షూటింగ్ ఫ్రారంభమైంది. ప్రియదర్శి, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన 'ఒక ఫ్యామిలీ స్టోరీ' ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే దర్శకుడిగా విజయాలు అందుకున్నారు కరుణకుమార్(palasa movie director name). ఆయన డైరెక్షన్‌లో ఓ సరికొత్త చిత్రం పట్టాలెక్కనుంది(karuna kumar next movie). విభిన్న కథా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియదర్శి, అంజలి, రావురమేశ్ కీలకపాత్రలు పోషించనున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు, విద్యామాధురి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం ఆదివారం వేడుకగా జరిగింది. పూజా కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు అల్లు అరవింద్, ఆయన తనయుడు బాబీ పాల్గొని.. టీమ్‌కు అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆసక్తిగా ట్రైలర్
సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'(oka chinna family movie). జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఈ సిరీస్ విడుదల కానుంది. నవంబర్ 19 నుంచి ప్రసారం కానున్న ఈ సిరీస్ టీజర్‌ను తాజాగా నటుడు నాని విడుదల చేశారు. టీజర్ ఆరంభంలో ఇంటి పక్కన వాళ్ల నుంచి పండ్లు అమ్మేవారి వరకూ.. ఇలా ప్రతి ఒక్కరూ 'మహేశ్' అని పిలుస్తూ కనిపించారు. 'నేనే మహేశ్.. మీకో స్టోరీ చెబుతా. ఇందులో ఓ అమ్మ, నాన్న, బామ్మ.. స్టోరీ ఇంతే అయితే బాగుండేది. కానీ మా నాన్న.. అందరికీ కలిపి ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు’' అంటూ సంగీత్ శోభన్ చెప్పే డైలాగ్‌లు, మధ్యతరగతి నిరుద్యోగిగా ఆయన పలికించిన హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై నిహారిక ఈ సిరీస్‌ను నిర్మించారు. ఓ మధ్యతరగతి నిరుద్యోగ యువకుడికి అనుకోకుండా అప్పుల బాధలు మీదపడితే.. పాకెట్ మనీకే ఇబ్బందిపడే అతడు రూ.25 లక్షలు కట్టాల్సి వస్తే.. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్‌ను రూపొందించారు. అలనాటి నటి తులసీ, నరేశ్ కీలకపాత్రలు పోషించారు. సిమ్రాన్ శర్మ కథానాయిక.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఆర్జీవీ 'ఆశ ఎన్కౌంటర్' ట్రైలర్.. రవితేజ మరో కొత్త సినిమా