ETV Bharat / sitara

అలా జరిగితే ఓటీటీలోనే 'నిశ్శబ్దం' - నిశ్శబ్దం సినిమా తాజా వార్తలు

ఎక్కువమంది దర్శక-నిర్మాతలు ఓటీటీలవైపు మొగ్గు చూపితే, 'నిశ్శబ్దం'ను అలానే విడుదల చేసే ఆలోచన ఉందన్నారు దర్శకుడు హేమంత్ మధుకర్.

అలా జరిగితే ఓటీటీలోనే 'నిశ్శబ్దం'
నిశ్శబ్దం సినిమాలో అనుష్కశెట్టి
author img

By

Published : May 3, 2020, 6:21 AM IST

మిగతా రంగాలతో పోల్చితే చిత్ర పరిశ్రమకు కరోనా దెబ్బ కాస్త గట్టిగానే తగిలింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ కోలుకోవాలంటే చాలా సమయమే పట్టేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధమైన సినిమాలకు నిర్మాణ భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. పలు చిన్న చిత్రాల నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్​ల వైపు దృష్టి సారిస్తున్నారు. పెద్దగా లాభాలు రాకున్నా, పెట్టుబడి వెనక్కొస్తే చాలనుకుంటూ, ఓటీటీల్లో విడుదల చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'నిశ్శబ్దం'.. ప్రేక్షకుల ముందుకు ఏ మాధ్యమంలో వస్తుందనే విషయంపై మాట్లాడారు దర్శకుడు హేమంత్ మధుకర్.

"మాకు ఓటీటీ ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమే. కానీ, చిత్ర బృందం థియేటర్​లో విడుదలకే ఆసక్తి చూపించింది. తెలుగు వెర్షన్‌కు సంబంధించి అన్ని పనులూ పూర్తయ్యాయి. తమిళ, మలయాళ, హిందీ వెర్షన్ల పనులు మిగిలే ఉన్నాయి. అవన్నీ అయ్యాక విడుదల విషయంలో పునరాలోచిస్తాం. లాక్‌డౌన్‌ ఎంత కాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆయా పరిస్థితుల్ని బట్టి తమ చిత్రాల్ని థియేటర్లలో ఆడించాలా? ఓటీటీలోకి తీసుకురావాలా? అన్నది దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. మెజార్టీ ఓటీటీ వైపు మొగ్గు చూపితే.. మేమూ ఆ మార్గాన్నే అనుసరిస్తాం" -హేమంత్ మధుకర్, 'నిశ్శబ్దం' దర్శకుడు

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కోన వెంకట్‌ నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.