ETV Bharat / sitara

'డీడీఎల్​జే' ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది: కాజోల్​​ - kajol sharuk love stories

'దిల్​వాలే దుల్హానియా లేజాయేంగే'.. బాలీవుడ్​లో ఎవర్​గ్రీన్​ క్లాసిక్​ హిట్​గా నిలిచిన ప్రేమకథ. నేటితో ఈ సినిమా విడుదలై పాతికేళ్లయింది. ఈ సందర్భంగా ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది నటి కాజోల్​. అన్నికాలాల వారిని అలరించే చిత్రం.. 'డీడీఎల్​జే' అని ఆమె అంటోంది.

'Dilwale Dulhania Le Jayenge' is timeless: Kajol on film's 25th anniversary
'డీడీఎల్​జే' కాలాతీతంగా నిలిచిపోయే చిత్రం: కాజోల్​
author img

By

Published : Oct 20, 2020, 10:19 PM IST

రాజ్​, సిమ్రాన్​ల ప్రేమ కావ్యానికి రూపం.. 'దిల్​వాలే దుల్హానియా లేజాయేంగే'. షారుఖ్​ ఖాన్​, కాజోల్​ జంటగా నటించిన ఈ చిత్రం.. నేటితో పాతిక వసంతాలను పూర్తి చేసుకుంది. బాలీవుడ్ ప్రేమకథల్లో చెదిరిపోని స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ సినిమా షూటింగ్​ జరుగుతున్నప్పుడు.. ఓ సాధారణ చిత్రంలో నటిస్తున్నానని మాత్రమే అనుకున్నానని చెప్పింది నటి కాజోల్​. కానీ, ఇంతటి స్థాయిలో నిలుస్తుందని ఊహించలేదని తెలిపింది. కాలాతీతంగా నిలిచిపోయే చిత్రం 'డీడీఎల్​జే' అని ఆమె చెబుతోంది.

"డీడీఎల్​జే కాలాతీతంగా నిలిచిపోయే చిత్రం. ఎందుకంటే.. ప్రతిఒక్కరూ ఏదో ఒక చోట రాజ్​, సిమ్రాన్​ పాత్రలలో తమని తాము ఊహించుకుంటారు. ఎన్నో ఏళ్లుగా ఆ పాత్రలను అందరూ ఇష్టపడుతున్నారు. బహుశా ఇక ముందూ ఇష్టపడుతూనే ఉంటారు. మనలో చాలా మందిలో సిమ్రాన్​ అనే ఓ పాత్ర ఉంటుంది. అందరూ సరైన పనులు చేయాలనే అనుకుంటారు. కానీ, తనలా చేయలేకపోతారు. ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య చోప్రాకు ఉన్న దృఢ విశ్వాసంతోనే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది."

--కాజోల్​, నటి.

రూ.నాలుగు కోట్లతో నిర్మించిన 'డీడీఎల్​జే' చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది. చెదిరిపోని రికార్డులను నమోదు చేసింది.

ఇదీ చూడండి:డీడీఎల్​జే@25: ప్రేమికులంటే గుర్తొచ్చేది షారుక్​, కాజోల్!

ఇదీ చూడండి:'రొమాంటిక్ పాత్రలకు సరిపోనేమో అనుకున్నా!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.