ETV Bharat / sitara

హీరోయిన్​కు మగబిడ్డ.. రెండు నెలలు ఐసీయూలోనే - Dia Mirza marriage

తనకు పుట్టిన చిన్నారి.. రెండు నెలల నుంచి ఐసీయూలోనే ఉన్నాడని హీరోయిన్ దియా మీర్జా వెల్లడించింది. ఆ విషయాన్నే చెబుతూ, ఇన్​స్టాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది.

Dia Mirza welcomes baby boy with husband Vaibhav Rekhi
దియా మీర్జా
author img

By

Published : Jul 14, 2021, 4:10 PM IST

'వైల్డ్​డాగ్'తో పాటు హిందీలో పలు హిట్​ సినిమాలు చేసిన హీరోయిన్ దియా మీర్జా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. మే నెలలో తనకు చిన్నారి పుట్టినప్పటికీ, బుధవారం(జులై 14) ఆ విషయాన్ని వెల్లడించింది. అతడికి 'అవ్యాన్ ఆజాద్ రేఖీ' పేరు పెట్టినట్లు చెబుతూ, జన్మించినప్పటి నుంచి చిన్నారి ఐసీయూలోనే ఉన్నాడని పేర్కొంది.

ప్రస్తుతం బాబు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో ఇంటికి తీసుకురానున్నామని దియా ఇన్​స్టాలో సుధీర్ఘమైన పోస్ట్​లో వెల్లడించింది. చిన్నారి ఫొటో షేర్ చేసిన సందర్భంగా ఆమెకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రియుడు వైభవ్ రేఖీని వివాహం చేసుకున్న దియా.. అంతకుముందే తాను గర్భవతి అన్న విషయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించింది. ఈ పెళ్లికి ముందు నిర్మాత సాహిల్ సంఘాను మనువాడిన దియా.. ఐదేళ్ల తర్వాత విడాకులు ఇచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.