ETV Bharat / sitara

Pawankalyan Birthday: పవన్ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ - పవన్​కల్యాణ్​ బర్త్​డే

సెప్టెంబరు 2 పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ పుట్టినరోజు(Pawankalyan Birthday) సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకంక్షలు తెలిపారు ప్రముఖ సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్​, బాబా సెహగల్​. తాము గతంలో పవన్​ కోసం పాడిన పాటలను రిప్రైజ్​ చేసి విడుదల చేశారు.

pawankalyan
పవన్​కల్యాణ్​
author img

By

Published : Sep 2, 2021, 10:11 AM IST

నేడు(సెప్టెంబరు 2) పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ పుట్టినరోజు(Pawankalyan Birthday). ఈ సందర్భంగా పలువురు నటులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్​, బాబా సెహగల్​ కూడా పవన్​కు ప్రత్యేకంగా బర్త్​డే విషెస్​ తెలిపారు. పవన్​ కోసం తాము పాడిన పాటలను విడుదల చేశారు.

గతంలో పవన్​.. త్రివిక్రమ్​ దర్శకత్వంలో 'జల్సా'(pawan kalyan jalsa cinema) సినిమాలో నటించారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్​ సంగీతమందించారు. ఇందులో 'జల్సా' అంటూ సాగే పాటను దేవీ ఆలపించారు. ఆ సమయంలో చిత్రీకరించిన ఈ గీతానికి సంబంధించిన ప్రమోషనల్​ మ్యూజిక్​ వీడియోను కొన్ని కారణాల వల్ల రిలీజ్​ చేయలేకపోయినట్లు తెలిపిన ఆయన.. ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా పవర్​స్టార్ ఫ్యాన్స్​ కోసం విడుదల చేశారు. ఈ సాంగ్​ను పవన్​కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

బాబా సెహగల్​.. పవన్​ మేనరిజాన్ని తెలుపుతూ తనదైన స్టైల్​లో ఆలపించిన ఓ ప్రత్యేక గీతాన్ని రిప్రైజ్​ చేసి రిలీజ్​ చేశారు. అది అభిమానులను ఉర్రూతలూగించేలా ఉంది.

'వకీల్​సాబ్'​తో రీఎంట్రీ ఇచ్చిన పవన్​.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నారు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ (భీమ్లానాయక్​), క్రిష్​ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు', హరీశ్​ శంకర్, సురేందర్​ రెడ్డి​ దర్శకత్వంలో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు పవర్​స్టార్​.

ఇదీ చూడండి: Pawankalyan Birthday: పవన్‌ పాత్రల్లో ఆ పేర్లకు ఉన్న క్రేజే వేరప్ప!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.