దీపికా పదుకునే, విక్రాంత్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'చపాక్'. ఈ సినిమాకు లీకుల బెడద తప్పట్లేదు. ఇప్పటికే స్కూల్ యూనిఫాంలో ఉన్న దీపికా వీడియో బయటకు రాగా.. తాజాగా హీరో హీరోయిన్ మధ్య వచ్చే ముద్దు సన్నినేశం సామాజిక మాధ్యమాల్లో లీకై వైరల్గా మారింది. ప్రస్తుతం దిల్లీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ చిత్రంలో విక్రాంత్, దీపిక మొదటి సారి జంటగా కనిపించనున్నారు. ఓ బిల్డింగ్పై కూర్చుని ఉన్న వీరి మధ్య తెరకెక్కిస్తున్న ముద్దు సన్నివేశాన్ని చూస్తూ ప్రేక్షకులు ఈలలు, గోలలతో సందడి చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా 2020 జనవరి 10న విడుదలవనుంది. దిల్లీలో జరిగిన యాసిడ్ దాడిలో గాయపడ్డ లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఆమె పాత్రలో దీపిక నటిస్తోంది.
ఇవీ చూడండి.. 'అమెరికా... నిన్ను నేను మిస్సవుతున్నా..'