ETV Bharat / sitara

కరోనాతో చిత్రసీమ ఆగమాగం.. రూ.1500కోట్లు నష్టం! - చిత్రపరిశ్రమపై కరోనా పడగ

Covid Effect On Bollywood: కరోనా చిత్రసీమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. తొలి, రెండో వేవ్‌ల్లో దాని విజృంభణకు భారీ నష్టాల్ని మూటగట్టుకుంది బాలీవుడ్‌ చిత్రసీమ. అయిందేదో అయిపోయింది ఈ ఏడాది బాగుంటుందన్న ఆశతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినా నిరాశే ఎదురైంది. మూడో వేవ్‌ దెబ్బకు మళ్లీ కథ మొదటికొచ్చింది. విడుదలలు వాయిదా వేయాల్సి వచ్చింది. షూటింగులు ఆగిపోయాయి. చాలా చోట్ల థియేటర్లు నడవడం లేదు. నడిచే చోట 50 శాతం ఆక్యుపెన్సీ. దీంతో పలు పాన్‌ ఇండియా స్థాయి సినిమాలతో పాటు భారీ బాలీవుడ్‌ చిత్రాల విడుదలా ఆగిపోయింది. దీంతో బాలీవుడ్‌కు తీవ్ర నష్టం తప్పట్లేదు.

Covid Effect On Bollywood
కరోనాతో బాలీవుడ్ ఆగమాగం
author img

By

Published : Jan 23, 2022, 6:42 AM IST

Covid Effect On Bollywood: కరోనా మూడోవేవ్‌ కారణంగా సినిమా విడుదలల వాయిదా, చిత్రీకరణ షెడ్యూల్స్‌ అన్నీ మారిపోవడం వల్ల బాలీవుడ్‌ ఓ విధంగా స్తంభించిపోయింది. 'జెర్సీ' సినిమా వాయిదాతో కరోనా ప్రభావం చిత్రసీమ మీద మొదలైంది. షాహిద్‌కపూర్‌ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇలా మొదలైన వాయిదాల పర్వం 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో రెట్టింపైంది. సినీవర్గాల్లో ఆందోళనా పెరిగిపోయింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో క్రేజీ చిత్రంగా మారింది.

రూ. 1000కోట్లకు పైగానే నష్టం

ఆ తర్వాత ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌', అక్షయ్‌ కుమార్‌ 'పృథ్వీరాజ్‌' వాయిదా పడటం వల్ల బాలీవుడ్‌లో సందడే పోయింది. మార్చి వరకూ ఈ పరిస్థితి. అదే జరిగితే తక్కువలో తక్కువ రూ.1000కోట్లు పైగానే నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు.

"2019 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి బాక్సాఫీసు లెక్కలు మారాయి. సంవత్సర లెక్కలు కాకుండా మూడు నెలల చొప్పున అంచనా వేస్తున్నాం. అలా చూసుకుంటే ఈ ఏడాది తొలి త్రైమాసికం దెబ్బతిన్నట్టే. దీని వల్ల చిత్ర నిర్మాణ రంగమే కాదు డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థ దెబ్బతింది" అంటున్నారు రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో శిభాషిస్‌ సర్కార్‌.

పండగను కోల్పోయాం

కీలకమైన పండగ సీజన్‌ బాలీవుడ్‌ను బాగా దెబ్బకొట్టిందనే ఆవేదన పరిశ్రమలో వ్యక్తం అవుతోంది. "బాక్సాఫీసు లెక్కల ప్రకారం చూస్తే ఈ ఏడాది తొలి త్రైమాసిక నష్టం రూ.1500కోట్లు. ఏడాది ప్రథమార్ధంలో కీలకమైన పండగ సీజన్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఫిబ్రవరి, మార్చిల్లో పరిస్థితులు అనుకూలించేలా లేవు. దాంతో ఏప్రిల్‌ నుంచి పరిస్థితి గాడిన పడుతుందనే ఆశతో ఉన్నాం" అంటున్నారు ట్రేడ్‌ విశ్లేషకుడు జోగిందర్‌.

చిత్రీకరణలు ఆగిపోయినా నష్టమే

భారీ చిత్రాల షూటింగులు నిలిచిపోవడమూ తీవ్ర నష్టమే అంటున్నారు నిర్మాతలు. "పెద్ద చిత్రాల నుంచి ఓ మాదిరి బడ్జెట్‌ చిత్రాల వరకూ షెడ్యూల్‌ ప్రకారం ముందస్తుగా చాలా సన్నాహాలు జరుగుతాయి. దాని కోసం రూ.కోట్లలో వ్యయం అవుతుంది. అవుట్‌డోర్‌ షెడ్యూల్స్‌ అంటే మరింత ఖర్చు ఉంటుంది. కరోనా తీవ్రత పెరగడం కారణంగా షూటింగులు ఆగిపోతున్నాయి. దీంతో చేసిన వ్యయంలో చాలావరకూ వృథా అయిపోతుంది. మళ్లీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేయాలంటే బడ్జెట్‌ పెరిగిపోతుంది. అంతే కాకుండా అనుకున్న సమయానికి విడుదల చేయలేని పరిస్థితి. సర్దుకుపోయి ఏదో ఒక తేదీకి విడుదల చేస్తే ఆశించిన వసూళ్లు రావు" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఏప్రిల్‌ వరకూ థియేటర్‌ల పరిస్థితులు మారేలా కనిపించడం లేదు. మార్చి తొలివారం తర్వాత ఆశాజనకంగా మారి భారీ చిత్రాలు విడుదల మొదలై, చిత్రీకరణలైనా అనుకున్న ప్రకారం జరిగితే కొంతమేర నష్టాల నుంచి గట్టెక్కొచ్చు అంటున్నాయి సినీ వ్యాపార వర్గాలు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

నమ్రతకు మహేశ్ స్పెషల్ బర్త్​డే విషెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.