ETV Bharat / sitara

చెదిరిన టాలీవుడ్ కళ..​ బొమ్మ బతికేదేలా?

మహమ్మారి కరోనా వల్ల టాలీవుడ్ దర్శకనిర్మాతల ఆలోచన తలక్రిందులైంది. వేసవిలో జరగాల్సిన దాదాపు రూ.1000 నుంచి రూ.1200 కోట్ల వ్యాపారం దెబ్బతింది. ఫలితంగా మిగతా చిత్రాల విడుదలలోనూ ఆటంకాలు ఏర్పడి, ఏడాది మొత్తం ఈ ప్రభావం ఉండే అవకాశముందని వారు భావిస్తున్నారు.

చెదిరిన టాలీవుడ్ కళ..​ బొమ్మ బతికేదేలా!
టాలీవుడ్​పై కరోనా పంజా
author img

By

Published : May 5, 2020, 7:17 AM IST

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా విస్తరిస్తున్న వేళ.. చిత్రసీమను కరోనా నిండా ముంచుతోంది. వేసవిలో టాలీవుడ్​లో జరగాల్సిన వందల కోట్ల వ్యాపారం ఆగిపోయింది. ఫలితంగా కోలుకోలేని విధంగా పరిశ్రమపై దెబ్బపడింది. థియేటర్లు, స్టూడియోల మూసివేత, విడుదలలు వాయిదా, వేసవిలో రావల్సిన సినిమాల చిత్రీకరణలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో 2020ని గడ్డుకాలంగా భావిస్తున్నారు.

లాక్​డౌన్​తో సినిమాలు వాయిదా పడటం వల్ల బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. అగ్రహీరోల చిత్ర షూటింగ్స్.. చిన్న, పెద్ద కలిపి సుమారు 50 వరకు ఆగిపోయాయి. దీంతో ఈ వేసవిలో జరగాల్సిన వ్యాపారంలో చిత్రసీమకు, సుమారు రూ.600 కోట్లకు పైగానే గండిపడగా... ఏడాది టర్నోవర్​లో రూ.1000 నుంచి రూ.1200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నిర్మాతలు లెక్కలేసుకుంటున్నారు.

సి.కల్యాణ్-నిర్మాత

మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలతో ఈ ఏడాది ప్రారంభంలోనే సుమారు రూ.250 కోట్ల వసూళ్లు అందుకుంది టాలీవుడ్. అవే వసూళ్లు వేసవిలోనూ బాక్సాఫీసు కురిపిస్తుందని భావించారు. పెద్ద హీరోలతో సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. సుమారు రూ.1000 కోట్ల వ్యాపారం చేయాలని అంచనాలు వేశారు. ఆ దిశగానే చిన్నా పెద్ద నిర్మాతలు కలిసి సుమారు 50 వరకు సినిమాల చిత్రీకరణ, విడుదల సన్నాహాలు చేసుకున్నారు. కానీ వారి ఆశలను తలకిందులు కరోనా దెబ్బకు తలకిందులయ్యాయి.

pawan vakeel saab
వకీల్​సాబ్​లో పవన్​ కల్యాణ్

యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?', రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా', నాని, సుధీర్​బాబు 'వి', రానా 'అరణ్య', అనుష్క 'నిశ్శబ్దం', రామ్ 'రెడ్'తోపాటు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన', కీర్తి సురేష్ 'మిస్ ఇండియా', రవితేజ 'క్రాక్', పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్', వెంకటేశ్ 'నారప్ప', నాగచైతన్య 'లవ్​స్టోరీ', సాయితేజ 'సోలో బ్రతుకే సో బెటర్', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', ఆర్కా మీడియా 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య', శర్వానంద్ 'శ్రీకారం' సినిమాలు ఈ వేసవిలో వినోదాన్ని పంచాలనుకున్నాయి. వీటిలో కొన్ని మినహా మిగతావన్నీ దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్లపైగా వ్యయంతో నిర్మించినవే. అవన్నీ కరోనా పుణ్యాన విడుదలకు నోచుకోకుండాపోయాయి.

సి. రామ్మోహన్ రావు, కూచిబొట్ల వివేక్

మార్చి, ఏప్రిల్, మేలో సినిమాలు మొత్తం వాయిదాపడగా.. భారీ బడ్జెట్ తో తీస్తున్న పెద్ద హీరోల 10 సినిమాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దసరా, దీపావళి, వచ్చే ఏడాది సంక్రాంతి కోసం విడుదలకు సన్నాహాలు చేసుకున్న వారి లెక్కలు తారుమారయ్యాయి. ఈ ఏడాదిలోనే రావాల్సిన చిరు 'ఆచార్య'.. వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. 'ఆర్ఆర్ఆర్'ను మాత్రం వచ్చే జనవరిలో తీసుకోచ్చి, చిత్రపరిశ్రమలో నూతన ఉత్సహాన్ని నింపాలని యూనిట్ భావిస్తోంది.

RRR POSTER
ఆర్ఆర్ఆర్ పోస్టర్

ప్రభాస్ 20వ సినిమా, వెంకటేశ్ 'నారప్ప'లకు సంబంధించి చిత్రీకరణ మధ్యలో నిలిచిపోయాయి. ఈ చిత్రాల విడుదల పరంగానే కాకుండా బడ్జెట్​ పరంగాను ప్రభావం చూపే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. పవన్​ 'వకీల్​సాబ్' విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు దర్శకనిర్మాతలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.