ETV Bharat / sitara

కాలం విడదీసిన ప్రేమకథ వీరిది - chiranjeevi sarja biography

కన్నడ చిత్రసీమ రియల్​లైఫ్​ కపుల్​ చిరంజీవి సర్జా-మేఘనా రాజ్‌. పదేళ్ల వీరి స్నేహాం, పెళ్లిబంధంతో ఒక్కటయ్యేలా చేసింది. కానీ చిరంజీవి మరణంతో వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దీంతో ఆమెను ఓదార్చేవారు కరవయ్యారు.

CHIRU SARJA MEGHANA
చిరంజీవి సర్జా- మేఘన రాజ్​
author img

By

Published : Jun 11, 2020, 11:04 AM IST

అనుకోని విధంగా పరిచయమై.. మంచి స్నేహితులుగా మారి.. వివాహబంధంతో ఒక్కటయ్యారు కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆయన సతీమణి మేఘనా రాజ్‌. అయితే ఈ చూడముచ్చటైన జంటను విధి విడదీసింది. సర్జా ఆకస్మిక మరణం మేఘనకు తీరని లోటును మిగిల్చింది. అంత్యక్రియల సమయంలో ఆమె మౌనరోదనతో అక్కడ ఉన్నవారందరి హృదయం ద్రవించింది. సదరు ఫొటోలు, వీడియోలను చూసి నెటిజన్లు సైతం భావోద్వేగానికి గురయ్యారు. వీరిద్దరి ప్రేమకథ తెలుసుకుని నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.

CHIRU SARJA MEGHANA
చిరంజీవి సర్జా- మేఘన రాజ్​

కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన సుందర్‌ రాజ్‌, ప్రమీలా జోషిల ఒక్కగానొక్క కుమార్తె మేఘనా రాజ్‌. కన్నడ ప్రముఖ నటుడు శక్తి ప్రసాద్‌ మనవడిగా వెండితెరకు పరిచయమైన వ్యక్తి చిరంజీవి సర్జా. యాక్షన్‌ హీరో అర్జున్‌కి చిరంజీవి మేనల్లుడు. ఓ శుభకార్యంలో నటి మేఘనారాజ్‌కి ఆమె తల్లి ప్రమీలా జోషి మొదటిసారి చిరంజీవి సర్జాని పరిచయం చేశారు. అలా వీరిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. మొదటి పరిచయంలోనే చిరు మాటలకు ముగ్ధురాలైన మేఘన ఆయనతో పరిచయం పెంచుకున్నారు. పదేళ్లపాటు మంచి స్నేహితులుగా ఉండి, అనంతరం ప్రేమబంధంలోకి అడుగుపెట్టారు.

CHIRU SARJA MEGHANA
చిరంజీవి సర్జా- మేఘన రాజ్​

అలా ఒక్కటయ్యారు

వీరిద్దరూ కలిసి నటించిన 'ఆటగార' చిత్రం 2015లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిల్వర్‌ స్ర్కీన్‌పై వీరి జంటను చూసి అభిమానులు మురిసిపోయారు. అనంతరం మేఘనా రాజ్‌పై తనకున్న ప్రేమ గురించి ఆమె తల్లి ప్రమీలా జోషికి 2017లో చిరంజీవి తెలియజేశాడు. పెద్దలు అంగీకరిస్తే మేఘనను మనస్పూర్తిగా పెళ్లాడతానని చెప్పాడు. ఇరు కుటుంబపెద్దల అంగీకారంతో 2017లో బెంగళూరులోని ఓ హోటల్‌లో చిరు-మేఘనల నిశ్చితార్థం వేడుకగా జరిగింది. అనంతరం 2018లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. క్రిస్టియన్‌, హిందూ సంప్రదాయాల్లో వీరి పెళ్లితంతు నిర్వహించారు.

CHIRU SARJA MEGHANA
చిరంజీవి సర్జా- మేఘన రాజ్​

ఇలా పిలుచుకునేవారు

తన భర్తని 'డార్ల్‌' అని ముద్దుగా పిలుస్తానని, ఆయన కూడా ప్రేమగా తనని 'కుట్టిఅమ్మ' అంటాడని మేఘనా రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఆ విధంగా పిలిచేవారట.

CHIRU SARJA MEGHANA
చిరంజీవి సర్జా- మేఘన రాజ్​

అంతలోనే చేజారిపోయిన సంతోషం

ప్రస్తుతం మేఘన గర్భవతి. తాను తండ్రి కాబోతున్నానని తెలిసిన వెంటనే చిరు ఎంతో సంతోషించారు. తన కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే శుభవార్తను తెలియజేశారు. త్వరలోనే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవాలని ఈ జంట భావించింది.

తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో చిరంజీవి కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు.

CHIRU SARJA MEGHANA
సర్జా మృతితో మౌనరోదనలో మేఘన

ఇది చూడండి : గుండెపోటుతో ప్రముఖ హీరో మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.