ETV Bharat / sitara

చిరు బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా కరోనా ప్లాస్మా - చిరంజీవి బ్లండ్ బ్యాంక్ ఉచిత ప్లాస్మా

పేద కరోనా బాధితుల కోసం చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ గొప్ప నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కరోనా బాధితులకు ఉచితంగా కొవిడ్ ప్లాస్మా సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది.

Chiranjeevi Eye and Blood Bank supplies plasma free for poor patients
చిరు బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా ప్లాస్మా
author img

By

Published : Sep 29, 2020, 11:00 PM IST

చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ పేద రోగులకు ఉచితంగా కొవిడ్‌-ప్లాస్మా అందిస్తోంది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కరోనా బాధితులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

"పచ్చటి జీవితాలపై కర్కశ కరోనా పంజా విసురుతూ చిన్నాభిన్నం చేస్తోంది. పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ప్లాస్మా వితరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం."

-చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రకటన

"తెల్ల రేషన్‌ కార్డుదారులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఉచితంగా ప్లాస్మా సరఫరా చేస్తోంది. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. కరోనా సోకి రోగ విముక్తులైన వారు ప్లాస్మాదానం చేస్తే మరికొంత మందికి ఆయుష్షు పోసినట్టే. 22 సంవత్సరాలుగా మెగాస్టార్‌ చిరంజీవి సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా రక్త నిధులు అందించారు. ఈ సందర్భంగా ఆ విషయాన్ని తెలియజేయడం సంతోషంగా ఉంది" అని సంస్థ సీఈవో ప్రకటన విడుదల చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.