ETV Bharat / sitara

లాక్​డౌన్​లో బరువు తగ్గిన సెలబ్రిటీలు! - గణేష్​ ఆచార్య వార్తలు

లాక్​డౌన్​ విరామంలో ఇంటికే పరిమితమైన సినీప్రముఖులు తమకు నచ్చిన వ్యాపకాలతో సమయాన్ని గడిపారు. కానీ, కొంతమంది ఈ సమయాన్ని వినియోగించుకుని బరువు తగ్గాలని నిశ్చయించుకున్నారు. అలా స్లిమ్​గా మారిన సెలబ్రిటీలు ఎవరంటే?

celebrity weight loss stories of 2020
లాక్​డౌన్​లో బరువు తగ్గిన సెలబ్రిటీలు!
author img

By

Published : Jan 2, 2021, 9:01 AM IST

Updated : Jan 2, 2021, 11:30 AM IST

లాక్​డౌన్​ వల్ల ప్రజలందరూ బలవంతంగా విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పలువురు సెలబ్రిటీలు.. తమకు నచ్చిన వ్యాపకాలతో సమయాన్ని గడిపారు. కొందరు స్టార్స్ మాత్రం ఈ సమయాన్ని ఫిట్​నెస్ మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టారు. జిమ్​లో కసరత్తులు చేసి చాలా బరువు తగ్గారు. అలాంటి వారెవరో తెలుసుకుందాం.

గణేశ్​ ఆచార్య

celebrity weight loss stories of 2020
గణేశ్​ ఆచార్య

బాలీవుడ్​ కొరియోగ్రాఫర్​గా గుర్తింపు తెచ్చుకున్న గణేశ్​ ఆచార్య.. లాక్​డౌన్​లో ఏకంగా 98 కిలోల బరువు తగ్గినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో 200 కిలోల బరువున్న ఈయన​.. కొన్ని నెలలుగా క్రమం తప్పకుండా జిమ్​ చేస్తున్నట్లు తెలిపారు. లాక్​డౌన్​ విరామంతో పూర్తిగా కసరత్తులపైనే దృష్టిపెట్టి ఫలితం పొందినట్లు తెలిపారు. 2015లో తాను నటించిన 'హే బ్రో' చిత్రం కోసం ఏకంగా 30-40 కిలోలు తగ్గినట్లు గుర్తుచేసుకున్నారు.

విద్యుల్లేఖ రామన్​

celebrity weight loss stories of 2020
విద్యుల్లేఖ రామన్

లాక్​డౌన్​లో బాగా బరువు తగ్గిన హాస్యనటి విద్యుల్లేఖ రామన్​.. తన ఫొటోలు పోస్ట్ చేయగా, నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బరువు విషయంలో తాను ఎదుర్కొన్న విమర్శలను సవాలుగా తీసుకుని, వర్కౌట్లు చేసిన ఈమె బరువు తగ్గింరట. జూన్​ నాటికే తాను 68 కిలోలకు చేరుకున్నానని తెలిపారు.

ఫర్దీన్​ ఖాన్​

celebrity weight loss stories of 2020
ఫర్దీన్​ ఖాన్

25 ఏళ్ల కుర్రవాడిగా కనిపించాలనే ఉద్దేశంతోనే తాను బరువు తగ్గానని బాలీవుడ్​ నటుడు ఫర్దీన్​​ ఖాన్ చెప్పారు​. ఆరు నెలల్లో 18 కిలోల బరువు కోల్పోయి ఫిట్​గా కనిపిస్తున్నారు. గతంలో చాలా బరువు ఉండే ఫర్దీన్​.. ఇలా వెయిట్​ లాస్​ అవ్వడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫర్దీన్​ ఖాన్​ తిరిగి సినిమాల్లో నటించనున్నారని బాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అర్షద్​ వార్సీ

celebrity weight loss stories of 2020
అర్షద్​ వార్సీ

'మున్నాభాయ్​ ఎంబీబీఎస్​' సినిమాలో సంజయ్​ దత్​ పక్కన నటించిన అర్షద్​ వార్సీ.. దక్షిణాది ప్రేక్షకులకూ సుపరిచితమే. లాక్​డౌన్​ విరామ సమయంలో ఫిట్​నెస్​పై దృష్టిపెట్టి.. 30 రోజుల్లో 6 కిలోల బరువు తగ్గినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల విడుదలైన హిందీ సినిమా 'దుర్గామతి'లో కీలకపాత్ర పోషించారు అర్షద్​.

అవికా గోర్​

celebrity weight loss stories of 2020
అవికా గోర్

'చిన్నారి పెళ్లికూతురు' ధారావాహికతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవికా గోర్​.. 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె చాలా చిత్రాల్లో బొద్దుగా కనిపించారు. గతేడాది తనకు దొరికిన విరామ సమయంలో 13 కిలోలకు పైగా బరువు తగ్గారు అవికా. ఇటీవలే కొన్ని ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్ చేయగా... అవి వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి: ఉత్తమ నటుడు 'ఏజెంట్​ ఆత్రేయ'.. ఉత్తమ చిత్రం 'జెర్సీ'

Last Updated : Jan 2, 2021, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.