టాలీవుడ్లో హిట్ సినిమాలు తమిళంలో రీమేక్ కావడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడీ జాబితాలోకి శ్రీ విష్ణు 'బ్రోచేవారెవరురా' చేరింది. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషించారు. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకొని, విమర్శకుల ప్రశంసలందుకుంది.
ప్రస్తుతం సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన వెలువడే అవకాశముంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : ఉన్నావ్ ఘటనలో ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు