Allu arjun Pushpa: సుకుమార్ దర్శకత్వంలో హీరో అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా 'పుష్ప'. డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్ర విడుదలపై కన్నడిగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కర్ణాటకలో బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ట్విట్టర్లో #BoycottPushpaKarnataka హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు.
కర్ణాటకలో కన్నడ వెర్షన్ కన్నా తెలుగు వెర్షన్‌ను ఎక్కువ షోలు ప్రదర్శించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. "తెలుగు వెర్షన్ 200 కన్నా ఎక్కువ షోలు.. హిందీ(10ప్లస్), మలయాళం, తమిళం(4ప్లస్) కన్నడలో కేవలం మూడు షోలు మాత్రమేనా?" అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
"తెలుగు వెర్షన్ పుష్పను కర్ణాటక ప్రజలపై రుద్దడమేంటి? మార్కెటింగ్ టీమ్ తప్పు చేస్తోంది, కన్నడిగులకు ఇది నచ్చదు. కర్ణాటక అంతా కన్నడలో రిలీజ్ చేయకపోతే సినిమా చూడను", "తెలుగు ప్రజలు కేజీఎఫ్‌ను కన్నడలో, ఏంథిరన్ను(రోబో) తమిళంలో, బెంగళూరు డేస్‌ను మలయాళంలో చూస్తారా? లేదు కదా! రెండు గంటల పుష్ప కోసం మా కన్నడ భాషను అవమానించలేము" అంటూ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Pushpa First Review: 'పుష్ప.. ఈ ఏడాది బెస్ట్ టాలీవుడ్ ఫిల్మ్'