ETV Bharat / sitara

అతిలోక సుందరికి మరో గౌరవం.. మైనపు విగ్రహం సిద్ధం - మైనపు విగ్రహం

అలనాటి తార, శ్రీదేవి మైనపు విగ్రహాన్ని.. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్​ మ్యూజియంలో బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్విట్టర్​ పంచుకున్నారు ఆమె భర్త బోనీ కపూర్.

అలనాటి తార, స్వర్గీయ శ్రీదేవీ
author img

By

Published : Sep 3, 2019, 1:15 PM IST

Updated : Sep 29, 2019, 6:55 AM IST

భారతీయ సినీ చరిత్రలో తొలి మహిళా సూపర్​స్టార్​గా కీర్తి గడించింది. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి.. గతేడాది ఆకస్మికంగా మృతి చెందింది అలనాటి తార శ్రీదేవి.

శ్రీదేవి గుర్తుగా ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్​ సింగపూర్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్​లో ఓ వీడియోను పంచుకున్నారు ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్.

"మా ఆలోచనల్లోనే కాకుండా కోట్లాది మంది అభిమానుల మదిలో శ్రీదేవి స్థానం సంపాదించింది. ఆమె మైనపు విగ్రహం చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. #SrideviLivesForever". -ట్విట్టర్​లో బోనీ కపూర్

శ్రీదేవి.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో నటించి అశేషమైన అభిమానుల్ని సంపాదించుకుంది. చివరగా 'మామ్'లో ప్రధాన పాత్ర పోషించింది. ఆమె మరణించిన అనంతరం ఈ చిత్రానికిగానూ ఉత్తమ నటి అవార్డు ఇచ్చారు.

ఇది చదవండి: శ్రీదేవీ పుట్టినరోజు ప్రత్యేకం: సిరిమల్లె పువ్వా.. చిరకాలం గుర్తుండిపోవా..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 29, 2019, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.